మూలిగే నక్క మీద తాటి పండు పడటం అంటే ఇదేనేమో. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచులు ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్.. మళ్లీ గాయపడ్డాడు.