సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని మరోసారి ట్రోల్ చేసిన రాజస్థాన్ రాయల్స్... అప్పుడు బిర్యానీ, ఇప్పుడు...

Published : Mar 29, 2022, 04:26 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెరోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఈ రెండు జట్లు, ఈసారి పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగుతున్నాయి...

PREV
110
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని మరోసారి ట్రోల్ చేసిన రాజస్థాన్ రాయల్స్... అప్పుడు బిర్యానీ, ఇప్పుడు...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ ఫన్నీ పోస్టులతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ కారణంగా పెద్దగా ఫ్యాన్ బేస్ లేని ఆర్‌ఆర్‌కి సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది...

210

అయితే ఐపీఎల్ మ్యాచులకు ముందు రెచ్చగొడుతూ పోస్టులు పెట్టడం రాజస్థాన్ రాయల్స్‌కి బాగా అలవాటు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కి ముందు ఇలాంటి ఓ పోస్టుతోనే కవ్విస్తోంది రాజస్థాన్...

310

‘ఆరెంజ్ జ్యూస్’ ఫోటోను పోస్టు చేసిన రాజస్థాన్ రాయల్స్, ‘గుడ్ మార్నింగ్...’ అంటూ కాప్షన్ జోడించింది. డైరెక్టుగా ఏ కామెంట్ చేయకపోయినా, ‘ఆరెంజ్ ఆర్మీని’ తాగేస్తామనే మీనింగ్‌లో ఈ పోస్టు చేసింది రాజస్థాన్...

410

అయితే ఇంతకుముందు 2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ముందు ‘ఈ రాత్రికి హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేశాం’ అంటూ పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్...

 

510

ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని, రాజస్థాన్ రాయల్స్‌ను ప్లేఆఫ్స్ రేసు నుంచి దూరం చేసింది. దీంతో మరోసారి రాయల్స్‌ను ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు...

610

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి రికార్డే ఉంది. ఇరుజట్లు ఇప్పటిదాకా 15 సార్లు తలబడగా 8 సార్లు ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది... 7 సార్లు ఆర్ఆర్‌కి విజయం దక్కింది..

710

గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచుల్లో విజయం అందుకుంటే, అందులో ఒకటి రాజస్థాన్ రాయల్స్‌పైనే దక్కింది. సెకండ్ ఫేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో గెలిచింది...

810

ఐపీఎల్ 2008లో టైటిల్ గెలిచిన తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్, మెగా వేలంలో మంచి మెరుగైన ప్లేయర్లను కొనుగోలు చేసింది...

910

యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సిమ్రాన్ హెట్మయర్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, దేవ్‌దత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్, జిమ్మీ నిశమ్, నాథన్ కౌంటర్‌నైల్, యజ్వేంద్ర చాహాల్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్డ్, నవ్‌దీప్ సైనీ వంటి స్టార్లతో ఐపీఎల్ 2022 సీజన్‌ బరిలో దిగనుంది రాజస్థాన్ రాయల్స్...

1010
nicholas pooran

మరోవైపు కేన్ విలియంసన్, అయిడిన్ మార్క్‌రమ్, మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, రొమారియో సిఫర్డ్, నికోలస్ పూరన్, గ్లెన్ ఫిలిప్స్, సీన్ అబ్బాట్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్ వంటి స్టార్లతో బరిలో దిగుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్..

click me!

Recommended Stories