కెఎల్ రాహుల్ కంటే హార్ధిక్ పాండ్యా చాలా బెటర్... 2 వికెట్లు తీసిన బౌలర్‌కి బాల్ ఇవ్వకుండా..

Published : Mar 29, 2022, 03:37 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. రెండేళ్లుగా సరైన ఫిట్‌నెస్ లేక, బ్యాటుతో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకోవడంపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది...

PREV
113
కెఎల్ రాహుల్ కంటే హార్ధిక్ పాండ్యా చాలా బెటర్... 2 వికెట్లు తీసిన బౌలర్‌కి బాల్ ఇవ్వకుండా..

వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత ఐపీఎల్ 2020తో పాటు గత సీజన్‌లోనూ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. అయినా మెంటర్ ఎమ్మెస్ ధోనీ కారణంగా టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీలో చోటు దక్కించుకోగలిగాడు...,

213

ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో చోటు కోల్పోయిన హార్ధిక్ పాండ్యా... గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకోవడంతోనే గుజరాత్ టైటాన్స్‌ జట్టుపై అంచనాలు పోయాయని, వాళ్లు టైటిల్ అసాధ్యమని తేల్చేశారు...

313

అయితే మరో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. 

413

లక్నోకి కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్, మరోసారి తన పూర్ కెప్టెన్సీతో విమర్శలు ఎదుర్కొంటే, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి...

513

మొదటి ఓవర్ మొదటి బంతికే కెఎల్ రాహుల్‌ని అవుట్ చేసిన మహ్మద్ షమీతో తొలి స్పెల్‌లో మూడు ఓవర్లు వేయించాడు హార్ధిక్ పాండ్యా...

613

మొదటి ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని, రెండో ఓవర్‌లో క్వింటన్ డి కాక్‌ని, ఆ తర్వాతి ఓవర్‌లో మనీశ్ పాండేని అవుట్ చేసి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నమ్మకాన్ని నిలుపుకున్నాడు మహ్మద్ షమీ...

713

‘మూడు ఓవర్లు వేసిన తర్వాత హార్ధిక్ పాండ్యా వచ్చి, ఇంకో ఓవర్ వేస్తావా? అని అడిగాడు. నేను... వద్దులే! చాలా సమయం ఉంది కదా... అని చెప్పాను..’ అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశాడు షమీ...

813

మొదటి ఓవర్‌లో వికెట్ తీసిన బౌలర్‌ను కొనసాగిస్తే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇదే స్ట్రాటెజీ వాడేవాడు...

913

మహ్మద్ షమీతో పాటు లూకీ ఫర్గూసన్‌, రషీద్ ఖాన్ వంటి ఫారిన్ స్టార్లను చక్కగా వాడిన హార్ధిక్ పాండ్యా... వరుణ్ ఆరోన్ బౌలింగ్‌ను కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు... 
 

1013

రెండో ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే శుబ్‌మన్ గిల్‌ను అవుట్ చేసి, గుజరాత్ టైటాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు దుస్మంత ఛమీరా... అతని రెండో ఓవర్ మొదటి బంతికే విజయ్ శంకర్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

1113

సాధారణంగా మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసిన బౌలర్‌ను కొనసాగించకపోగా డెత్ ఓవర్లలో సరిగా వాడుకుని... ప్రత్యర్థిని కట్టడి చేయాలని ఆలోచిస్తాడు ఏ కెప్టెన్ అయినా... అయితే కెఎల్ రాహుల్ మాత్రం ఇంకోలా ఆలోచించాడు...

1213

డెత్ ఓవర్లలో పార్ట్ టైమ్ బౌలర్ దీపక్ హుడా, స్పిన్నర్ రవిభిష్ణోయ్‌లకు బౌలింగ్ ఇచ్చిన కెఎల్ రాహుల్... దుస్మంత ఛమీరాతో పూర్తి కోటా బౌలింగ్ కూడా వేయించలేకపోయాడు...

1313

మొత్తంగా 3 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన ఛమీరా... తన కోటాలో చివరి ఓవర్ వేయలేకపోయాడంటే దానికి కారణం కెఎల్ రాహుల్ గ్రేట్ కెప్టెన్సీయే అని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు...

click me!

Recommended Stories