IPL2022: అతడు వన్డే ప్లేయర్.. టీ20లలో సక్సెస్ అయ్యేలా కనిపించడం లేదు.. గుజరాత్ ఓపెనర్ పై వీరూ విసుర్లు

Published : Mar 29, 2022, 02:34 PM IST

TATA IPL2022: రిటెన్షన్ ప్రక్రియలో రూ. 8 కోట్లు పోసి దక్కించుకున్న ఆటగాడు తొలి మ్యాచులోనే డకౌట్ అయితే ఆ ఫ్రాంచైజీ,  అభిమానుల బాధ వర్ణనాతీతం.  గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ కూడా లక్నోతో మ్యాచులో డకౌట్ అయి అందరినీ  నిరాశపరిచాడు. 

PREV
16
IPL2022: అతడు వన్డే ప్లేయర్.. టీ20లలో సక్సెస్ అయ్యేలా కనిపించడం లేదు.. గుజరాత్ ఓపెనర్ పై వీరూ విసుర్లు

టీమిండియా యువ ఆటగాడు,  రిటెన్షన్ ప్రక్రియలో గుజరాత్ టైటాన్స్ రూ. 8 కోట్లు పెట్టి దక్కించుకున్న  ఆటగాడు శుభమన్ గిల్ ఆటతీరుపై  భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అతడు వన్డే ప్లేయర్ అని, టీ20లకు ఆడాల్సిన ఆట ఆడటం లేదని కామెంట్స్ చేశాడు. 

26

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో  శుభమన్ గిల్..  పరుగులేమీ చేయకుండానే 3 బంతుల్లోనే డకౌట్ గా వెనుదిరిగిన నేపథ్యంలో సెహ్వాగ్ స్పందించాడు. 

36

వీరూ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం అతడు వన్డేలకు  బాగా పనికొస్తాడు. టీ20 క్రికెట్ లో పవర్ ప్లే లో బౌండరీలు బాదిన వాళ్లే విజయవంతమవుతారు.  గిల్ తో పాటు ఆటగాళ్లంతా ఆ విషయమ్మీదే ఫోకస్ పెట్టాలి. 

46

ఇటీవలే అతడు నేను  కొన్ని  ప్రత్యేకమైన షాట్స్ ఆడటం నేర్చుకున్నానని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.  కానీ  లక్నోతో మ్యాచులో అతడి బ్యాటింగ్ చూస్తే మాత్రం అతడు  చీకీ షాట్స్ ఆడాల్సిన అవసరం లేదని అనిపించింది.  గిల్ సాధారణ షాట్స్ ఆడినా బాగా ఆడేవాడేమో...’ అని అన్నాడు. 

56

టీ20 క్రికెట్ లో అయితే  వేగంగా ఆడటాన్ని మరిచిపోకూడదని వీరూ చెప్పాడు.  అతడి స్ట్రైక్ రేట్ పెంచుకోవాలని, ఆ దిశగా అతడు సాధన చేయాలని వీరూ చెప్పుకొచ్చాడు.  లక్నో లో  దీపక్ హుడా, ఆయుష్ బదోని ఆడినట్టు ఆడినా గిల్ ఆడితే బాగుండేదని తద్వారా అతడి స్ట్రైక్ రేట్ మెరుగయ్యేదని తెలిపాడు. 

66

ఓపెనర్లుగా తాను గానీ, సచిన్ టెండూల్కర్ గానీ, గౌతం గంభీర్ గానీ గిల్ చెప్పిన చీకీ షాట్లు ఆడలేదని వీరూ  అన్నాడు.  అటువంటి షాట్స్ ఆడటానికంటే ముందు బ్యాటర్లు కొన్ని పరుగులు చేసి ఉండాలని సెహ్వాగ్ వివరించాడు.  

Read more Photos on
click me!

Recommended Stories