సురేష్ రైనా విషయంలో కూడా ఇలాగే జరిగింది... రవీంద్ర జడేజా విషయంలో సీఎస్‌కే తీరుపై...

First Published May 12, 2022, 3:23 PM IST

ఐపీఎల్‌లో ఏ ప్లేయర్‌ కూడా ఏ ఫ్రాంఛైజీకి శాశ్వతంగా ఆడతాడనే నమ్మకం, గ్యారెంటీ లేదు. గత సీజన్‌లో డేవిడ్ వార్నర్ విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన తీరుతోనే ఈ విషయం ఐపీఎల్ ఫ్యాన్స్‌కి తెలిసిపోయి ఉంటుంది. ఈసారి సీఎస్‌కే, జడ్డూ విషయంలో కూడా ఇలాగే చేస్తోందా?

Ravindra Jadeja

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రవీంద్ర జడేజా. గత సీజన్‌కి ముందు నుంచే ఎమ్మెస్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీ తీసుకోవాలని భావించాడు జడ్డూ...

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో రవీంద్ర జడేజా కోరుకున్నట్టుగా ఏదీ జరగలేదు. దీపక్ చాహార్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడం, జట్టులో ఉన్న సీనియర్లు అంతా ఎమ్మెస్ ధోనీకి నమ్మకస్థులు కావడంతో జడేజా కెప్టెన్సీని ఎంజాయ్ చేయలేకపోయాడు...

Latest Videos


అదీకాక జడేజా ఆన్ పేపర్ కెప్టెన్‌గా మాత్రమే మిగిలిపోతే ఆన్ ఫీల్డ్‌లో ఫీల్డింగ్ సెట్టింగ్స్ దగ్గర్నుంచి బౌలర్ల మార్పుల దాకా అన్నీ దగ్గరుండి చూసుకుంటూ అసలైన కెప్టెన్‌గా వ్యవహరించాడు ఎమ్మెస్ ధోనీ... 

అటు విజయాలు రాక, ఇటు ఉట్టి కెప్టెన్‌గా మిగిలిపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు రవీంద్ర జడేజా. జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా? లేక తప్పించారా? అనేది అనుమానంగానే మిగిలిపోయింది...

అదీకాకుండా జడేజా కెప్టెన్‌గా ఉన్నంత కాలం సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు వంటి ప్లేయర్లు...ఎమ్మెస్ ధోనీ తిరిగి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక బ్యాటు ఝలిపించడం మొదలెట్టారు. దీంతో సీఎస్‌కే తిరిగి విజయాల బాట పట్టింది...

గాయం కారణంగా రవీంద్ర జడేజా జట్టుకి దూరమైనా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ విజయం తర్వాత జడ్డూ, సీజన్ మొత్తానికి దూరమవుతున్నట్టు వార్తలు రావడం, అదే సమయంలో సీఎస్‌కే, జడేజాని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం జరిగిపోయాయి...

ఇవన్నీ చూస్తుంటే రవీంద్ర జడేజా విషయంలో చెన్నై సూపర్ కింగ్స్‌ వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

‘జడేజా ఈ సీజన్‌లో ఆడడం లేదు, వచ్చే సీజన్‌లో కూడా ఆడడేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు సురేష్ రైనా విషయంలో కూడా ఇలాగే జరిగింది...

సురేష్ రైనాని తప్పించే ముందు గాయం పేరుతో జట్టుకి దూరం చేశారు. జట్టు నుంచి దూరమయ్యాక ఆ తర్వాత సీజన్‌లో తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు...

2021 సీజన్‌లో సురేష్ రైనా వ్యవహరించినట్టే, రవీంద్ర జడేజాని కూడా జట్టుకి దూరం చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ చూడడం లేదు కదా.. అదే చేస్తే సీఎస్‌కే నష్టం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

ఐపీఎల్‌లో సీఎస్‌కే మూడు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాని, 2021 సీజన్‌లో సగం మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసిన చెన్నై సూపర్ కింగ్స్, 2022 మెగా వేలంలో తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.

Image Credit: Getty Images

ఐపీఎల్‌లో 5500+ లకు పైగా పరుగులు చేసిన సురేష్ రైనాని, ఏ ఫ్రాంఛైజీ బేస్ ప్రైజ్‌కి కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రైనా, అన్‌సోల్డ్‌ ప్లేయర్‌గా మిగిలిపోవడానికి సీఎస్‌కే తెర వెనక నడిపిన రాజకీయాలే కారణమనేవారు లేకపోలేదు..

click me!