ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. స్టార్ ఓపెనర్ కు టైఫాయిడ్.. సీజన్ కు కష్టమే..

Published : May 12, 2022, 03:05 PM IST

Prithvi Shaw: ప్లేఆఫ్ రేసులో కీలక మ్యాచులో నెగ్గి మరో రెండు మ్యాచుల దూరంలో నిలిచిన  ఢిల్లీ  క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్,  కీలక ఆటగాడు రిషభ్ పంత్ టైపాయిడ్ తో బాధపడుతున్నాడు. 

PREV
16
ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. స్టార్ ఓపెనర్ కు టైఫాయిడ్.. సీజన్ కు కష్టమే..

ఐపీఎల్-2022 సీజన్ లో పడుతూ లేస్తూ ఓ విజయం మరో పరాజయం అంటూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, ఓపెనర్  పృథ్వీ షా  టైపాయిడ్ తో బాధపడుతున్నాడట. 

26

ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ తెలిపాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ అనంతరం  పంత్ మాట్లాడుతూ షా కు సంబంధించిన కీలక అప్టేడ్ ఇచ్చాడు.

36

పంత్ మాట్లాడుతూ.. ‘పృథ్వీని మేం చాలా మిస్ అవుతున్నాం. అతడు టైపాయిడ్ వంటి జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స   పొందుతున్నాడు. ఇప్పటికైతే ఆరోగ్యంగానే ఉన్నాడు.. కానీ మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండేది అనుమానమే..’ అని అన్నాడు. 

46

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షా.. ఢిల్లీ ఆడబోయే తర్వాతి  రెండు మ్యాచులకు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అనేది అనుమానంగానే ఉన్న నేపథ్యంలో అది ఢిల్లీ కి కోలుకోలేని దెబ్బే. 

56

ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు తోడుగా  సీజన్ ప్రారంభంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన   అతడు.. మే 1న లక్నో తో చివరి మ్యాచ్ ఆడాడు.

66

దూకుడుగా ఆడి ఢిల్లీ కి పవర్ ప్లే లో  వేగంగా పరుగులు సాధించే పృథ్వీ షా లేని లోటు ఢిల్లీకి కచ్చితంగా లోటే.  పంత్ స్థానంలో ఆడుతున్న   ఆంధ్రా ఆటగాడు కోన శ్రీకర్ భరత్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అతడు ఆడిన రెండు మ్యాచుల్లో కూడా  రాణించలేదు. రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. 

click me!

Recommended Stories