ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వేరే లెవెల్. 15 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయినా, ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాలా కప్ నమ్ దే’ అంటూ కొత్త ఉత్సాహంతో తమ ఫేవరెట్ టీమ్‌కి సపోర్ట్ చేశారు ఆర్‌సీబీ ఫ్యాన్స్... ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి 2016 ఫైనల్ ఓ పీడకలలా మిగిలిపోయింది...
విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని విధంగా చెలరేగిపోవడం, అతనితో పాటు ఏబీ డివిల్లియర్స్ కూడా చెలరేగిపోవడంతో అద్భుత విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది ఆర్‌సీబీ...
210
అప్పటికి నాలుగు సీజన్ల అనుభవం మాత్రమే ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్ కావడంతో ఈసారి ఆర్‌సీబీ టైటిల్ గెలవడం పక్కా అనుకున్నారంతా. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ స్టేడియమంతా నిండిపోయింది..
310
అయితే ఫైనల్‌లో ఆర్‌సీబీని 8 పరుగుల తేడాతో ఓడించి, మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది ఆరెంజ్ ఆర్మీ... కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే ఆశ నెరవేరకుండానే విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది...
410
‘2016 ఫైనల్‌లో నేను ఆర్‌సీబీ తరుపున ఆడాను. అది నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఆర్‌సీబీకి ఆ టైటిల్ విజయం ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు..
510
హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్. ఆ ఏడాది ఆర్‌సీబీ అద్భుతంగా ఆడింది, సెకండాఫ్‌లో టాప్ టీమ్స్‌కి చుక్కలు చూపించింది. విరాట్ కోహ్లీ మామూలు ఫామ్‌లో లేడు...
610
ఆర్‌సీబీయే గెలుస్తారని అంతా అనుకున్నారు. ఆర్‌సీబీలో గ్రేటెస్ట్ ప్లేయర్లు ఉండడంతో ఆ సీజన్‌లో విరాట్ కోహ్లీ, ఐపీఎల్ టైటిల్ గెలవాల్సింది. అయితే నేను వేసిన ఓ ఓవర్, వాటన్నింటినీ తుడిచి పెట్టేసింది...
710
ఆ టైమ్‌లో ఆఖరి ఓవర్ వేసి ఉండాల్సింది కాదని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటా. ఇప్పటికీ ఆ మ్యాచ్ చూసినప్పుడల్లా ఫీల్ అవుతూనే ఉంటా. ఆ మ్యాచ్ సమయంలో నా కెరీర్ ముగిసిపోయిందనే అనుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వాట్సన్...
810
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో బెన్ కట్టింగ్ మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు...
910
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ భాగస్వామ్యం కారణంగా 10 ఓవర్లు ముగిసే సమయానికే 112/0 పరుగులు చేసిన ఆర్‌సీబీ, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 200 పరుగులకి పరిమితమై 8 పరుగుల తేడాతో ఓడింది.. వాట్సన్ ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు ఇచ్చినా ఫలితం వేరేగా ఉండేది...
1010
అయితే ఈ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కి వెళ్లిన షేన్ వాట్సన్, 2018 ఫైనల్‌లో సీఎస్‌కే టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కాలికి గాయమై రక్తం కారుతున్నా, అలాగే బ్యాటింగ్ చేసి సెంచరీ బాదాడు షేన్ వాట్సన్..