గెలిచినా ఓడినా డిసైడ్ చేసేది ముంబైయే... రోహిత్ టీమ్‌నే నమ్ముకున్న ఆ నాలుగు జట్లు..

Published : May 17, 2022, 11:47 AM IST

వాడు ఎక్కుడున్నా రాజే రా... అన్నట్టుగా మోస్ట్ టైమ్ ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2022 సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్నా, సీజన్ ప్లేఆఫ్స్‌కి డిసైడర్ టీమ్‌గా మారిపోయింది...

PREV
110
గెలిచినా ఓడినా డిసైడ్ చేసేది ముంబైయే... రోహిత్ టీమ్‌నే నమ్ముకున్న ఆ నాలుగు జట్లు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచుల్లో ఓడి ఆఖరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి టీమ్‌గా నిలిచింది. అయితే ప్లేఆఫ్స్‌కి ఎవరు వెళ్లాలో, ఎవరు వెళ్లకూడదో ముంబై ఇండియన్స్‌ జట్టుపైనే ఆధారపడింది... 

210

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంతో టాప్ 4లో ఉన్న ఆర్‌సీబీని కిందికి నెట్టి, ఆ పొజిషన్‌లోకి వెళ్లి కూర్చుంది రిషబ్ పంత్ టీమ్...

310

దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అలాగే ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది...

410

సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఛాన్సులను కూడా ముంబై ఇండియన్స్ జట్టే డిసైడ్ చేయనుంది. ముంబైతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్ ఛాన్సులు సజీవంగా ఉంటాయి...

510

వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గెలవడంతో పాటు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా నిలుపుకోగలుగుతుంది. 

610

ఒకవేళ ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మూడో జట్టుగా నిలుస్తుంది. 

710

మే 19న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. టాప్ 4లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది ఆర్‌సీబీ. లేదంటే అసలే నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న బెంగళూరు, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది..

810

ఆర్‌సీబీ, టైటాన్స్‌ని ఓడిస్తే మే 21 ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్లేఆఫ్స్ బెర్తులపై ఓ స్పష్టమైన క్లారిటీ రానుంది.

910

ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఇండియన్స్ ఓడిస్తే ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారి, ఆఖరి లీగ్ మ్యాచ్ ఫలితం తేలేవరకూ ఉత్కంఠ నెలకొంటుంది... అదే ఢిల్లీ, ముంబైని ఓడిస్తే... రేసు ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మిగులుతుంది...

1010

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఓడిస్తే 8 విజయాలతో 16 పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన మ్యాచుల్లో గెలిచినా 7 విజయాలతో 14 పాయింట్లతో నిలిచి టాప్ 4లోకి ఎంట్రీ ఇవ్వలేవు...

click me!

Recommended Stories