ఐపీఎల్‌లో హాల్ ఆఫ్ ఫేమ్‌ని తీసుకొచ్చిన ఆర్‌సీబీ... క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్‌లకు చోటు...

Published : May 17, 2022, 12:25 PM IST

ఐపీఎల్‌లో విజయాల సంగతి ఎలా ఉన్నా, ఆటగాళ్లను చూసుకునే విషయంలో ఆర్‌సీబీ రూటే సెపరేటు. రాయల్ లైఫ్, విలాసవంతమైన సౌకర్యాలన్నీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల కోసం సమకూర్చబడతాయి. తాజాగా ఐపీఎల్‌లో ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఆర్‌సీబీ...

PREV
19
ఐపీఎల్‌లో హాల్ ఆఫ్ ఫేమ్‌ని తీసుకొచ్చిన ఆర్‌సీబీ... క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్‌లకు చోటు...

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కి ఎనలేని సేవలు చేసిన క్రికెటర్లను గుర్తించి, వారికి ‘హాల్ ఆఫ్ ఫేమ్‌’లో చోటు కల్పిస్తుంది ఐసీసీ. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తారు క్రికెటర్లు. ఇప్పుడు ఆర్‌సీబీ కూడా ఐపీఎల్‌లో ‘హాల్ ఆఫ్ ఫేమ్‌’ని తీసుకొచ్చింది...

29

ఆర్‌సీబీ మాజీ క్రికెటర్లు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్‌లకు ‘ఆర్‌సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌’లో చోటు దక్కింది. ఈ ఇద్దరికి ఓ ప్రత్యేకమైన మెడల్‌తో పాటు ఆర్‌సీబీకి అందించిన సేవలకు అభినందనలు తెలుపుతూ ప్రత్యేక నోట్‌ని అందించింది బెంగళూరు జట్టు..

39

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంపులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఇద్దరూ టీమ్‌కి చేసిన సేవలను గుర్తు చేసుకున్నాడు. ఏబీడీతో, క్రిస్ గేల్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు...  

49

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరుపున క్రిస్ గేల్ కొట్టిన 175 పరుగుల హైయెస్ట్ వ్యక్తిగత స్కోరును, ఏబీ డివిల్లియర్స్ పెంచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్‌ వాల్యూని ఎవ్వరూ రిప్లేస్‌ చేయలేరని అన్నాడు విరాట్ కోహ్లీ..

59

ఏబీ డివిల్లియర్స్, 11 సీజన్ల పాటు ఆర్‌సీబీకి ఆడగా, క్రిస్ గేల్ 7 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనడం లేదు...

69

ఆర్‌సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోవాలంటే మూడు అర్హతలు కచ్ఛితంగా ఉండాలని తెలియచేసింది ఆ ఫ్రాంఛైజీ. ఆ ప్లేయర్ కనీసం 3 సీజన్ల పాటు ఆర్‌సీబీ తరుపున ఆడి ఉండాలి...

79

అలాగే రెండోది ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ ఉండకూడదు. ఇక మూడోది ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఆర్‌సీబీ బ్రాండ్‌ని చూపించే విధంగా వ్యవహరించి ఉండాలి...

89

2011 నుంచి 2021 వరకూ ఆర్‌సీబీకి ఆడిన ఏబీ డివిల్లియర్స్, 157 మ్యాచుల్లో 2 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 4522 పరుగులు చేశాడు.. స్ట్రైయిక్ రేటు 158.33

99

2011 నుంచి 2017 వరకూ ఆర్‌సీబీ తరుపున ఆడిన క్రిస్ గేల్, 91 మ్యాచుల్లో 5 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో 3420 పరుగులు చేశాడు. స్ట్రైయిక్ రేటు 154.40 కాగా అత్యధిక స్కోరు 175 నాటౌట్..

click me!

Recommended Stories