ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... ఇండియాలోనే ఐపీఎల్ పండగ, అది కూడా ప్రేక్షకుల మధ్య...

Published : Jan 31, 2022, 09:53 AM ISTUpdated : Feb 03, 2022, 07:28 PM IST

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి భారత క్రికెట్ బోర్డు త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుందట. కరోనా థర్డ్ వేవ్ కేసులు పెరుగుతుండడంతో ఇండియాలో ఐపీఎల్ 2022 సీజన్ జరుగుతుందా? లేదా? అనే విషయమై అనుమానాలు రేగాయి...

PREV
111
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... ఇండియాలోనే ఐపీఎల్ పండగ, అది కూడా ప్రేక్షకుల మధ్య...

ఐపీఎల్ 2022 సీజన్‌తో పాటు ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌ను యూఏఈ వేదికగా నిర్వహించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది భారత క్రికెట్ బోర్డు...

211

ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత 2022 సీజన్ ఇండియాలోనే నిర్వహిస్తామని ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. అయితే కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు పెరుగుతుండడంతో ఈసారి కూడా యూఏఈ వేదికగా సీజన్ జరుగుతుందని ప్రచారం జరిగింది...

311

యూఏఈతో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక వంటి దేశాలు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15 నిర్వహణకు ఆసక్తి చూపించాయి. అయితే ఈసారి కూడా ఇండియాలోనే ఐపీఎల్ జరగబోతున్నట్టు సమాచారం...

411

యూఏఈతో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక వంటి దేశాలు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15 నిర్వహణకు ఆసక్తి చూపించాయి. అయితే ఈసారి కూడా ఇండియాలోనే ఐపీఎల్ జరగబోతున్నట్టు సమాచారం...

511

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగినా, గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ తీవ్రత అనుకున్నంతగా లేదు...

611

దీంతో ఐపీఎల్ 2022 సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని భావిస్తోందట బీసీసీఐ. అయితే థర్డ్ వేవ్ లేదా ఫోర్త్ వేవ్‌ కేసులను దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్రలోని ముంబై, పూణె నగరాల్లో మూడు వేదికల్లో మ్యాచులన్నీ నిర్వహించాలని చూస్తోందట...

711

ఐపీఎల్ 2022 సీజన్‌కి ప్రేక్షకులను కూడా అనుమతించాలని ఆలోచన చేస్తోంది బీసీసీఐ. అయితే పూర్తి వ్యాక్సిన్ కోర్సు సర్టిఫికెట్‌ ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుంది...

811

అలాగే ప్రేక్షకుల మధ్య వ్యక్తిగత దూరం ఉండేలా కేవలం 25 నుంచి 30 శాతం స్టేడియం కెపాసిటీని మాత్రం మ్యాచులు లైవ్ చూసేందుకు అనుమతించాలని ఆలోచనలు చేస్తోంది భారత క్రికెట్ బోర్డు...

911

ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడం వల్ల బీసీసీఐకి లాభాలు వచ్చినా, దేశంలో రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్ ఐపీఎల్ ద్వారా వచ్చే టికెట్ల ఆదాయాన్ని కోల్పోయాయి...

1011

ఐపీఎల్ మ్యాచులు జరిగితే ఆయా రాష్ట్రాల్లోని స్టేడియాలు ప్రేక్షకులతో కళకళలాడేవి. ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు కూడా అదనపు ఆదాయం చేకూరేది... రెండేళ్లుగా ఈ ఆదాయం రావడం లేదు...

1111

ఐపీఎల్ 2022 సీజన్ నుంచి మళ్లీ ఈ ఆదాయానికి గేట్లు తెరవాలని చూస్తోంది బీసీసీఐ. 10 జట్లతో 74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఐపీఎల్ సీజన్ 15ని మార్చి 27 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ ఆలోచనలు చేస్తున్నట్టు సమచారం...

Read more Photos on
click me!

Recommended Stories