IPL 2022: ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్..? కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్...

Published : Jan 30, 2022, 02:47 PM ISTUpdated : Feb 03, 2022, 07:29 PM IST

IPL 2022 Venues: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహించదలచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-15 సీజన్ కోసం వేదికలను ఖరారు చేసిందా..? అంటే అవుననే అంటున్నాయి బోర్డు వర్గాలు. 

PREV
110
IPL 2022: ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్..? కరోనా వ్యాప్తిని  అరికట్టేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్...

బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి నుంచి జరుగబోయే ఐపీఎల్-15 ను ఎక్కడ నిర్వహించాలనేదానిమీద బోర్డుతో పాటు ఐపీఎల్ పాలక మండలి సభ్యులు మల్లగుల్లాలుపడుతున్నారు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా దుబాయ్ లేదా సౌతాఫ్రికాలో నిర్వహించేందుకు బీసీసీఐ ఆలోచిస్తున్నదన్న  వార్తలు ఒకవైపు వినిపిస్తున్నాయి.. 

210

ఈ నేపథ్యంలో బోర్డుకు సంబంధించిన పలువురు ప్రతినిధులు చెప్పిన సమాచారం మేరకు.. విదేశాల్లో కాకుండా ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నదట. అయితే గతంలో మాదిరిగా దేశంలోని పలు నగరాల్లో కాకుండా..  ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లోనే ఈ లీగ్ ను నిర్వహించనున్నారని తెలుస్తున్నది. 

310

మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ క్యాష్ రిచ్ లీగ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాప్తిని అరికట్టేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. 
 

410

ఈ మేరకు బీసీసీఐ తో పాటు ఐపీఎల్ పాలక మండలి కూడా  దీనిపై చర్చలు జరిపి ఓ అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తున్నది. లీగ్ మ్యాచులను మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల స్టేడియాలలో నిర్వహించాలని చూస్తున్నది. ఈ మూడు స్టేడయలతో పాటు పూణె ను కూడా ఆప్షన్ గా పెట్టుకుంది.

510

ఇక ప్లే ఆఫ్స్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది బీసీసీఐ. దీనిపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులతో చర్చించినట్టు తెలుస్తున్నది. 
 

610

దేశంలో కరోనా వ్యాప్తి  ఉధృతంగా కొనసాగుతున్నది.  అయితే మూడో వేవ్ గా పరిణమిస్తున్న ఈ దశ మార్చి  వరకు బలహీనపడే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు.  మార్చి  మాసాంతం (మార్చి 27 నుంచి) లోనే ఐపీఎల్ ప్రారంభమవనుంది. 
 

710

దీంతో మార్చి వరకు  పరిస్థితులు ఇదే విధంగా ఉంటే  అప్పుడు ఈ రెండు వేదికల్లోనే ఐపీఎల్ నిర్వహణ ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. ఈ రెండు వేదికలకు విమాన ప్రయాణం కూడా అవసరం లేదు. 
 

810

అహ్మదాబాద్-ముంబయి సమీపాన ఉన్న నగరాలే.  గతంతో పోలిస్తే వివిధ నగరాలకు రాకపోకల కోసం విమాన ప్రయాణాలను ఉపయోగించే ఫ్రాంచైజీ నిర్వాహకులకు కూడా దీని ద్వారా నిర్వహణ ఖర్చు కూడా మిగులుతుంది. 

910

ఇక ఈ సీజన్ కోసం  స్టేడియాలలో ప్రేక్షకులను అనుమతించాలా..? వద్దా..? అనే విషయమై కూడా బీసీసీఐ  చర్చలు సాగిస్తున్నది. కరోనా కారణంగా గత రెండు ఐపీఎల్ సీజన్లలో ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు జరిగాయి.

1010

అయితే ఈసారి ఐపీఎల్ ప్రారంభమయ్యేనాటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనీసం 25 శాతం సామర్థ్యంతో అయినా మ్యాచులను నిర్వహించేందుకు బీసీసీఐ  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని బోర్డుకు చెందిన ఓ ప్రతినిధి తెలిపాడు. 

click me!

Recommended Stories