విదేశాల్లో టీమిండియా విజయాలకు అతడే కారణం.. కానీ అదొక్కటే..!! కోహ్లిపై ఇయాన్ చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Jan 30, 2022, 03:40 PM IST

Ian Chapell Lauds Virat Kohli: విదేశాలలో  భారత్ కు విజయాలతో  పాటు సిరీస్ లను అందించిన ఘనత విరాట్ కోహ్లికే దక్కుంతుందని ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.  కానీ అతడి కెరీర్ లో..   

PREV
18
విదేశాల్లో టీమిండియా విజయాలకు అతడే కారణం.. కానీ అదొక్కటే..!! కోహ్లిపై ఇయాన్ చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli

భారత క్రికెట్ జట్టులో ఏడేండ్ల పాటు టెస్టు సారథిగా వ్యవహరించిన  మాజీ కెప్టెన్ టీమిండియాలో అత్యంత విజయవంతమైన నాయకుడు అనడంలో సందేహం లేదు. టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో అతడికి  కెప్టెన్ గా మంచి రికార్డు ఉంది. 

28

కోహ్లి వచ్చిన తర్వాత భారత జట్టు దృక్పథంలోనే మార్పు వచ్చింది. టీమిండియాకు మాజీ సారథి సౌరవ్ గంగూలీ అలవరిచిన దూకుడును కోహ్లి.. మరింత ముందుకు తీసుకెళ్లాడు. ధోని కూడా దూకుడుగానే ఉన్నా.. స్వతహాగా అతడు మృదు స్వభావి. కానీ కోహ్లి అలా కాదు. అగ్రెసివ్ అటిట్యూడ్ కు అతడు బ్రాండ్ అంబాసిడర్. 

38

గతంలో  స్వదేశంలో  వీరవిహారం చేసి  విదేశాల్లో దారుణంగా విఫలమయ్యే జట్టుగా భారత్ కు పేరుంది.  దీనిని  కోహ్లి పూర్తిగా మార్చివేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఆ జట్లను  వన్డేలు, టీ20లతో పాటు సుదీర్ఘ ఫార్మాట్ (టెస్టులు) లలో కూడా ఓడించింది టీమిండియా. ఇదంతా  కోహ్లి వల్లే సాధ్యమైందంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ సారథి  ఇయాన్ చాపెల్..  

48

చాపెల్ మాట్లాడుతూ.. ‘2018-19 లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు.. 2021 లో ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లినప్పుడు విరాట్ సాధించిన విజయాలు అనన్య సామాన్యమైనవి.  స్వదేశంలో భారత జట్టు ఎప్పటికీ  సమర్థవంతమైన జట్టే. కానీ విదేశాల్లో ఆ జట్టుకు విజయాలను నేర్పిన గంగూలీ, ధోని ల వారసత్వాన్ని  కోహ్లి మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఏడేండ్లలో అతడు అఖండ విజయాలు అందించాడు. 

58

ఆసీస్, ఇంగ్లాండ్ లలో భారీ విజయాలు అందుకున్న  విరాట్ కోహ్లికి  దక్షిణాఫ్రికాలో ఓడటం కచ్చితంగా బాధ కలిగించేదే. సిరీస్ లో తొలుత 1-0తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత 1-2 తో ఓడిపోవడంతో అతడు నిరాశ చెంది ఉంటాడు...’ అని చాపెల్ అన్నాడు. 

68

ఇంకా చాపెల్ మాట్లాడుతూ.. ‘ఆట విషయంలో కోహ్లి తన సహచరులతో  అగ్రెసివ్ గా ఉంటాడనేది అందరికీ తెలిసిందే. కానీ వాళ్లలో ప్రతిభను బయటకు తీయడంలో అతడు సక్సెస్ అయ్యాడు. ఇందుకు మంచి ఉదాహరణ   వికెట్ కీపర్ రిషభ్ పంత్..

78

కోహ్లికి తన కెరీర్ లో ఎన్నో రికార్డులు ఉన్నప్పటికీ  అతడి సారథ్యంలో  రిషభ్ పంత్ ను అత్యుత్తమ వికెట్ కీపర్, బ్యాటర్ గా తీర్చిదిద్దడమనేది మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం..’అని  చాపెల్ చెప్పాడు.  

88

68 టెస్టులలో భారత్ కు సారథిగా వ్యవహరించిన  విరాట్.. 40 మ్యాచులలో విజయాలు సాధించాడు.  17 మాత్రమే ఓడిపోయాడు. స్టీవ్ వా, గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్ తర్వాత  కెప్టెన్ లుగా టెస్టులలో అత్యధిక విజయాలు సాధించిన నాయకుడు కోహ్లీనే.. ఇక భారత్ లో అయితే అత్యధిక టెస్టు విజయాలు సాధించిన సారథి కోహ్లియే.. రికార్డులు ఘనంగా ఉన్నా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తో విబేధాలతో కోహ్లి.. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories