ఐపీఎల్ 2022 సీజన్‌లో మ్యాచుల సంగతి ఎలా ఉన్నా, అంపైరింగ్ నిర్ణయాలు మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అవుట్ దగ్గర్నుంచి డేవిడ్ వార్నర్ క్యాచ్ అవుట్ నిర్ణయం దాకా అంపైర్, థర్డ్ అంపైర్ తీసుకున్న చాలా నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి...
రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నడుముపైకి వచ్చిన ఫుల్ టాస్ డెలివరీకి నో బాల్ ఇవ్వకపోవడంతో ఢీసీ టీమ్ పెద్ద రాద్ధాంతమే చేసింది...
29
ఆఖరి ఓవర్‌లో విజయానికి 36 పరుగులు కావాల్సిన దశలో మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు వచ్చిన తర్వాత జరిగిన ఈ సంఘటన... మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది వాపోయాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్..
39
తాజాగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా చాలా నిర్ణయాలు... ప్లేయర్లకు, మ్యాచ్ చూసే అభిమానులకు అసహనాన్ని, ఆగ్రహాన్ని తెప్పించాయి...
49
తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్, దాన్ని కాపాడుకోలేక 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదు ఓటముల తర్వాత కేకేఆర్‌కి దక్కిన అత్యంత కీలక విజయమిది...
59
ఆఖరి 2 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 18 పరుగులు కావాల్సి వచ్చాయి. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో 4 వైడ్లు రావడం, కేకేఆర్‌కి బాగా కలిసి వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మూడో బంతి వైడ్ యార్కర్‌గా వెళ్లింది.
69
ఆ తర్వాతి బంతికి రింకూ సింగ్ ఫోర్ బాదడం, నాలుగో బంతిని కూడా వైడ్‌గా సిగ్నల్ ఇచ్చాడు అంపైర్ నితిన్ పండిట్. బ్యాటు కింద నుంచి వెళ్తున్న బాల్‌కి వైడ్ ఇవ్వడంతో సంజూ శాంసన్ షాక్ అయ్యాడు...
79
ఊరికే వైడ్ అంటూ సిగ్నల్ ఇస్తున్న అంపైర్‌పై అసహనంతో డీఆర్‌ఎస్ కోరుకుంటున్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. అయితే వైడ్ బాల్‌కి డీఆర్‌ఎస్‌కి రిఫర్ చేసేందుకు అంపైర్లు అంగీకరించలేదు...
89
అదే ఓవర్ ఆఖరి బంతికి కూడా నితీశ్ రాణా బ్యాటు కింద నుంచి వెళ్తున్న బంతిని కూడా వైడ్‌గా కాల్ చేశాడు అంపైర్. ఈ నిర్ణయంపై సంజూ శాంసన్ అసహనం వ్యక్తం చేయడం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది..
99
బ్యాట్స్‌మెన్, బౌలర్ తప్పు చేస్తే ఫైన్ రూపంలో శిక్షించే యాజమాన్యం, అంపైర్లు చేసే ఇలాంటి తప్పిదాలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అలా ఫైన్ పడితేనే అంపైరింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయని కామెంట్ చేస్తున్నారు...