రోహిత్ ఇక చాలు, రెస్ట్ తీసుకో! బుమ్రాను పక్కనబెట్టి, అతనికి కెప్టెన్సీ ఇవ్వండి... మంజ్రేకర్ సలహా..

First Published May 17, 2022, 6:21 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకి ఏదీ కలిసి రావడం లేదు. ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ మేనేజ్‌మెంట్ చూపించిన అలసత్వం, టీమ్ పర్ఫామెన్స్‌పై గట్టిగానే ఎఫెక్ట్ చూపించింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్, ఆఖరి ప్లేస్ నుంచి పైకి రావడానికి మ్యాచులు ఆడాల్సిన పరిస్థితుల్లో పడింది...

12 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న ముంబై ఇండియన్స్, మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి... చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడితే... పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాలు తారుమారు అవుతాయి...

4 విజయాలతో ఉన్న సీఎస్‌కే 10వ స్థానానికి పడిపోయి, ఆఖరి పొజిషన్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ టాప్ 9 లోకి వస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడితే, ఆఖరి పొజిషన్‌లోకి పడిపోయే ప్రమాదం కూడా ఉంది...

‘ఇప్పటికే ముంబై ఇండియన్స్ కథ ముగిసింది, ఇకపై జరిగే మ్యాచుల్లో రిజల్ట్ ఎలా వచ్చినా వారికి పెద్దగా నష్టం కలిగే ప్రమాదమేమీ లేదు. కాబట్టి ఇకనైనా యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే మంచిది...

చాలా మంది యువ క్రికెటర్లు, ఇలాంటి మ్యాచుల్లో ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా మారారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా అలా వచ్చినవాడే. కాబట్టి రోహిత్, ఇక రెస్ట్ తీసుకో... 

జస్ప్రిత్ బుమ్రాకి కూడా విశ్రాంతి ఇస్తే... ఇషాన్ కిషన్‌కి బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపించి, యువ క్రికెటర్లకు టాపార్డర్‌లో అవకాశాలు ఇవ్వాలి. ఫ్యూచర్ స్టార్లను గుర్తించేందుకు ఇలాంటి ప్రయోగాలు బాగా ఉపయోగపడతాయి...

ఇషాన్ కిషన్‌కి అండర్ 19లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. కాబట్టి రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరనేదానికి సమాధానం వెతికి పెట్టుకుంటే బెటర్... 

టీ20 వరల్డ్ కప్‌ రాబోతోంది. కాబట్టి రోహిత్ శర్మ ఇక విశ్రాంతి తీసుకుని, రీఎనర్జీతో తర్వాతి సిరీస్‌కి సిద్ధమవ్వు... కెప్టెన్సీ ప్రెషర్‌ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్టు అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...
 

ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 18.17 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు రోహిత్... 

click me!