పంత్, నీ ఇగో తగ్గించుకోకపోతే సక్సెస్ కాలేవు... ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌పై మాజీ క్రికెటర్ కామెంట్...

First Published May 17, 2022, 5:40 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరేందుకు అడుగు దూరంలో ఉన్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, టాప్ 4లోకి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు రిషబ్ పంత్ టీమ్‌కి ఎక్కువగానే ఉన్నాయి...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే శార్దూల్ ఠాకూర్ చెలరేగి 4 వికెట్లు తీయడంతో ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటూ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది ఢిల్లీ...

పృథ్వీ షా అనారోగ్యం కారణంగా జట్టుకి దూరం కావడంతో డేవిడ్ వార్నర్‌తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ ఓపెనర్‌గా రాగా, టూ డౌన్‌లో లలిత్ యాదవ్‌ని బ్యాటింగ్‌కి పంపింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఈ ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు...

‘ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రిషబ్ పంత్ కంటే ముందు లలిత్ యాదవ్ ఎందుకు బ్యాటింగ్‌కి వచ్చాడు. పంత్, బ్యాటింగ్‌కి వస్తే స్కోరు రేటును పెంచేవాడుగా...

లలిత్ యాదవ్ 24 బంతులాడి 21 పరుగులు చేశాడు. నువ్వేమో వచ్చి ఓ సిక్సర్ కొట్టి, ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యావు. నీ బ్యాటింగ్‌లో లోపం ఎక్కడుందో తెలుసా... నీ ఇగో...

David Warner

నీ ఇగో తగ్గించుకోకపోతే సక్సెస్ కాలేవు. లియామ్ లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టాలనే పంతంతో వికెట్ పారేసుకున్నావు. అప్పటికే డేవిడ్ వార్నర్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు...

అలాంటి ప్రారంభం దొరకడమంటే పంజాబ్ కింగ్స్‌కి లాటరీ తగిలినట్టే. అయితే సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడాడు. డిఫరెంట్ షాట్స్ ఆడుతూ చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. మిచెల్ మార్ష్ కూడా అదరగొట్టాడు...

రోవ్‌మెన్ పావెల్‌ అవుటైనా అక్షర్ పటేల్ చేసిన పరుగులు చాలా అమూల్యమైనవి. అక్షర్ చేసిన 17 పరుగులే, ఢిల్లీ క్యాపిటల్స్‌కీ, పంజాబ్ కింగ్స్‌కీ మధ్య తేడా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

click me!