అవును అతడు కచ్చితంగా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు.. తెలుగు తేజంపై గవాస్కర్ ప్రశంసలు

First Published May 17, 2022, 5:34 PM IST

Tilak Varma: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న యువ సంచలనం తిలక్ వర్మ పై  భారత క్రికెట్ దిగ్గజం  సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడదగ్గ ప్లేయర్ అని కొనియాడాడు. 

ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో ఏదీ కలిసిరాలేదు. ఆ జట్టు ఈ ఏడాది అత్యంత చెత్త ఆటతీరుతో  నిరాశపరిచింది. అయితే ఆ జట్టుకు ఈ సీజన్ లో  అంతగా కలిసిరాకున్నా  పలువురు  మంచి ఆటగాళ్లు  దొరికారు. భవిష్యత్ లో  ఆ ఫ్రాంచైజీ తరఫున  సుదీర్ఘకాలం ఆడేందుకు నాణ్యమైన ప్లేయర్లు లభించారు. 

ఈ జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు తిలక్ వర్మ.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ తెలుగు తేజం.. ముంబై తరఫున కీలక మ్యాచులు ఆడాడు.  ముంబై గెలిచిన మ్యాచ్ లలో అతడి పాత్ర ఎంతో కీలకం. అదే విధంగా ఓడిన మ్యాచులలో కూడా  తిలక్ వర్మ కారణంగా ముంబై భారీ ఓటములు తప్పించుకుంది. 

అయితే ఈ ఆటగాడు త్వరలోనే టీమిండియాలోకి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవుతడాని భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్  సునీల్ గవాస్కర్  అన్నాడు. ఒక బ్యాటర్ కు ఉండాల్సిన బేసిక్స్ అన్ని  తిలక్ లో ఉన్నాయని  కొనియాడాడు. 

ఓ జాతీయ పత్రికతో  సన్నీ మాట్లాడుతూ.. ‘తిలక్ వర్మ గురించి రోహిత్ శర్మ చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. అతడు టీమిండియాకు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు.  అందుకు తగిన దారిని కూడా అతడు  నిర్మించుకున్నాడు. ఇప్పుడిక చేయాల్సింది అందుకు కొంచెం కృషి...

ఫిట్నెస్ కాపాడుకోవడం.. టెక్నిక్ ను మెరుగుపరుచుకోవడం.. వంటి చిన్న చిన్న విషయాల పై దృష్టి సారిస్తే అతడికి తిరుగుండదు. అతడికి  ఒక బ్యాటర్ కు ఉండాల్సిన బేసిక్స్ అన్నీ ఉన్నాయి. సాంకేతికంగా అతడు చాలా మెరుగైన ఆటగాడు. 

బంతిని అంచనా వేసి దాని లైన్ కు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం అతడి టాలెంట్. డిఫెండ్ చేసేప్పుడు అతడి బ్యాట్.. ప్యాడ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. అదీగాక బ్యాట్ ను ఎప్పుడూ నేరుగా పట్టుకుంటాడు. ఇవన్నీ బేసిక్  విషయాలు. వాటన్నింటినీ అతడు ఎప్పుడో అవపోసన పట్టాడు. 

బేసిక్స్ అన్ని తెలిసినాక ఇంకేముంది.. ఇక  మీరు  మ్యాచ్ స్వభావాన్ని పెళ్లి చేసుకోవడమే. అతడు తన ఫామ్ ను కంటిన్యూ చేస్తాడని ఆశిస్తున్నా..’ అని సన్నీ తెలిపాడు. 

ఈ సీజన్ లో  ముంబై తరఫున 12 మ్యాచులాడిన తిలక్ వర్మ.. 368 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. రూ. 15 కోట్లు పెట్టిన ఇషాన్ కిషన్ కంటే తిలక్ వర్మనే ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో అతడు ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగుల వీరుడుగా ఉన్నాడు.

click me!