రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా మనీశ్ పాండే... ఆ టోర్నీల్లో పర్ఫామెన్స్ కారణంగా ఆర్‌సీబీ ఆలోచన...

Published : Dec 23, 2021, 03:19 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే ఆర్‌సీబీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. గత 9 సీజన్లలో ఆర్‌సీబీని నడిపించిన విరాట్ ఆ పొజిషన్ నుంచి తప్పుకోవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై ఉత్కంఠనెలకొంది...

PREV
113
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా మనీశ్ పాండే... ఆ టోర్నీల్లో పర్ఫామెన్స్ కారణంగా ఆర్‌సీబీ ఆలోచన...

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో భాగంగా విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. యజ్వేంద్ర చాహాల్‌ను కూడా వేలానికి వదిలేసింది...

213

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగింది. అయితే నిలకడలేమికి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే మ్యాక్స్‌వెల్‌కి కెప్టెన్సీ అప్పగించే సాహసం రాయల్ ఛాలెంజర్స్ చేయకపోచ్చు...

313

పంజాబ్ కింగ్స్‌కి గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఆ టీమ్‌ను వీడడంతో... ఆర్‌సీబీ తర్వాతి కెప్టెన్ అతనేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి...

413

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా రాబోతున్న లక్నో ఫ్రాంఛైజీతో కెఎల్ రాహుల్‌, రూ.20 కోట్లకు భారీ ఢీల్ కుదుర్చుకున్నాడని టాక్ వినబడుతోంది...

513

ఇదే నిజమైతే కెఎల్ రాహుల్, ఐపీఎల్ మెగా వేలానికి కూడా రాకపోవచ్చు. ఇక మిగిలింది శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్‌కి చేర్చాడు శ్రేయాస్ అయ్యర్.

613

యువ జట్టును ఫైనల్‌కి చేర్చి, కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చిన అయ్యర్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది...

713

ఐపీఎల్ 2022 సీజన్‌‌లో కొత్తగా రాబోతున్న మరో ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ జట్టు, శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంచుకుందని సమాచారం. దీంతో ఆర్‌సీబీ తర్వాత కెప్టెన్ లిస్టు నుంచి అయ్యర్ కూడా మిస్ అయ్యాడు...

813

డేవిడ్ వార్నర్‌, ఐపీఎల్ 2016 సీజన్‌లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్‌కి టైటిల్ అందించాడు. ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కి ఘనమైన రికార్డు ఉంది...

913

అదీకాకుండా గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ మంచి స్నేహితులు కూడా. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని 2022 సీజన్‌లో నడిపించే బాధ్యత వార్నర్‌కే దక్కతుందుని ప్రచారం నడుస్తోంది...

1013

తాజాగా ఈ లిస్టులోకి మనీశ్ పాండే వచ్చి చేరాడు. కర్ణాటక జట్టు కెప్టెన్‌గా దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో మనీశ్ పాండేకి అద్భుతమైన రికార్డు ఉంది. 2021 సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో కర్ణాటక ఫైనల్ చేరింది...

1113

ఈ రికార్డు కారణంగా మనీశ్ పాండేకి ఆర్‌సీబీ కెప్టెన్సీ అప్పగించాలని యోచిస్తోందట టీమ్ మేనేజ్‌మెంట్. మనీశ్ పాండే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు కూడా కావడం అతన్ని ఆర్‌సీబీ కెప్టెన్ చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి వస్తోందట...

1213

సన్‌రైజర్స్ హైదరాబాద్ 2021 సీజన్‌లో ఆడిన ఆఖరి మ్యాచ్‌లో మనీశ్ పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో ఓడినా, భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో కలిసికట్టుగా పోరాడేలా జట్టును నడిపించిన కెప్టెన్‌గా మనీశ్ పాండేకి మంచి మార్కులే పడ్డాయి...

1313

అందుకే మనీశ్ పాండేకి ఆర్‌సీబీ పగ్గాలు అప్పగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీమిండియాలో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులా మారిన మనీశ్ పాండేకి ఆర్‌సీబీ కెప్టెన్సీ దక్కితే మాత్రం అది సంచలనమే అవుతుంది...
 

click me!

Recommended Stories