కొన్నిసార్లు టాలెంట్ ఉన్నా సరే, ఉన్నదంతా చూపించకూడదు. మొదట్లోనే టాలెంట్ మొత్తం చూపించేస్తే, ఆ తర్వాత ఆ రేంజ్‌ను కొనసాగించకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి సరిగ్గా ఇదే...
కెరీర్ ఆరంభం నుంచి జెట్ స్పీడ్‌లో పరుగులు చేయడానికే తయారుచేసిన మెషిన్‌లా పరుగుల వరద పారించాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
213
దశాబ్దంలో 20 వేలకు పైగా పరుగులు చేసి, ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు కూడా గెలిచాడు. అయితే ఎంత మంచి మెషిన్ అయినా ఎప్పుడో ఒకప్పుడు రిపేర్ కావాల్సిందే, ఈ రన్ మెషిన్ విషయంలోనూ అదే జరిగింది...
313
కరోనా కారణంగా గత ఏడాది పెద్దగా క్రికెట్ ఆడలేకపోయిన విరాట్ కోహ్లీ, రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు. సెంచరీ లేకుండానే దాదాపు 50 ఇన్నింగ్స్‌లు కూడా ఆడేశాడు విరాట్...
413
మెరుపు వేగంతో 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీకి 71వ సెంచరీ అందని ద్రాక్షగా ఊరిస్తూ ఉంది...
513
సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయగలడని అనుకున్న విరాట్, 70 నుంచి ముందుకు కదలకపోవడం ఫ్యాన్స్‌ని బాగా డిస్సపాయింట్ చేస్తోంది...
613
ఇదీ కాకుండా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని బలవంతంగా తప్పించింది బీసీసీఐ. ఈ నిర్ణయంపై స్వయంగా విరాట్ కోహ్లీయే అసంతృప్తి, అసహనం, ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశాడు...
713
అయితే ఇన్ని ఎమోషన్స్ చూపించినా విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేకపోవడం, ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడం వల్లే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందనేది ఎవ్వరూ కాదనలేని నిజం...
813
ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది భారత జట్టు. ఈ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ రాణించడం టీమిండియాకి మాత్రమే కాదు, అతనికి కూడా అత్యంత ఆవశ్యకం...
913
విమర్శలు వచ్చిన ప్రతీ సారి తన బ్యాటుతోనే సమాధానం చెప్పడం విరాట్ కోహ్లీకి అలవాటు. ఈ సారి కూడా విరాట్ తన పర్ఫామెన్స్‌తోనే సమాధానం చెబుతాడని ఆశిస్తున్నారు అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు...
1013
అభిమానుల అంచనాలు కూడా విరాట్ కోహ్లీని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేయొచ్చు. ఒకవేళ ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ విఫలమైతే, అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐకి సపోర్ట్ విపరీతంగా పెరుగుతుంది...
1113
అంతేకాదు వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉన్న బీసీసీఐ, అతనిపై చర్యలు తీసుకునేందుకు ఎదురుచూస్తోంది...
1213
సఫారీ టూర్‌లో ఫెయిల్ అయితే బీసీసీఐకి కూడా విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోవడానికి అవకాశం దొరికినట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు విరాట్ కోహ్లీ తప్పక రాణించాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు...
1313
గత సౌతాఫ్రికా పర్యటనలో దుమ్మురేపే పర్ఫామెన్స్‌తో మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టిన విరాట్ కోహ్లీ, ఈసారి టెస్టుల్లో ఒక్క సెంచరీ చేస్తే చాలు, అతని అభిమానులు పండగ చేసుకుంటారు, తనని విమర్శించిన చాలామందికి సమాధానం చెప్పినట్టు అవుతుంది...