అవసరమైతే టీమ్‌లోకి ఆ స్టాండ్ బై ప్లేయర్‌... ప్రాక్టీస్ సెషన్స్‌లో అదరగొట్టిన దీపక్ చాహార్...

Published : Dec 23, 2021, 02:56 PM IST

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైన జట్టులో నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహార్‌లకు స్టాండ్ బై ప్లేయర్లుగా చోటు దక్కిన విషయం తెలిసిందే. సైనీకి టీమిండియా తరుపున టెస్టులు ఆడిన అనుభవం కూడా ఉండగా, దీపక్ చాహార్ టెస్టు ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నాడు...

PREV
111
అవసరమైతే టీమ్‌లోకి ఆ స్టాండ్ బై ప్లేయర్‌... ప్రాక్టీస్ సెషన్స్‌లో అదరగొట్టిన దీపక్ చాహార్...

ఐపీఎల్ 2021 సీజన్‌తో పాటు అంతకుముందు శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లో, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన దీపక్ చాహార్... నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో అదరగొడుతున్నాడట. 

211

భారత బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్ కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని సమాచారం...

311

అందుకే మొదటి టెస్టులో భారత బౌలర్ల పర్ఫామెన్స్‌ను చూసి, ఏ బౌలర్ అయినా ఫెయిల్ అయితే... ఆ తర్వాతి మ్యాచుల్లో దీపక్ చాహార్‌ను తుదిజట్టులో చేర్చి ఆడించే ఆలోచనలో కూడా టీమిండియా చేస్తున్నట్టు సమాచారం... 

411

సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో పాటు ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటి ఫాస్ట్ బౌలర్లకు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కింది...

511

ఇందులో ఇషాంత్ శర్మ గత కొన్ని నెలలుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. గాయం కారణంగా ఆసీస్ టూర్‌లో ఆడలేకపోయిన ఇషాంత్ శర్మ, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో రాణించినా స్పిన్నర్ల ఆధిపత్యం కారణంగా పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు..

611

ఇంగ్లాండ్ టూర్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ గాయం కారణంగా బరిలో దిగలేకపోయాడు. శతాధిక టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నాయి...

711

సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలు తుదిజట్టులో ఉండడం పక్కా. వారితో పాటు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు...

811

సౌతాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై స్పిన్ బౌలర్లు పెద్దగా రాణించలేరు. కాబట్టి నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగాలని భారత జట్టు భావించవచ్చు. అదే జరిగితే నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ మధ్య పోటీ ఉంటుంది...

911

మూడు టెస్టుల సిరీస్ తర్వాత బుమ్రా, షమీ, సిరాజ్ వన్డే సిరీస్‌ కూడా ఆడే అవకాశం ఉంది. కాబట్టి సీనియర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లతో పాటు వీరిని రొటేషన్ పద్ధతిలో వాడుకోవాలని చూస్తోంది టీమిండియా...

1011

ఒకవేళ మొదటి టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్లు అనుకున్నట్టుగా రాణించకపోతే ఘోరంగా విఫలమైన పేసర్ స్థానంలో దీపక్ చాహార్ తుది స్థానంలో రావడం పక్కా అని వినిపిస్తోంది...

1111

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో మార్పులు చేయడానికి ఉపయోగించిన గాయం వంకతో తొలి టెస్టులో ఫెయిల్ అయిన బౌలర్‌ను తప్పించి, దీపక్ చాహార్‌కి అవకాశం ఇవ్వాలని విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ యోచిస్తున్నారని సమాచారం...

click me!

Recommended Stories