ఐపీఎల్ గత సీజన్‌లో తనను అన్ని రకాలుగా అవమానించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అదిరిపోయే రేంజ్‌లో రివెంజ్ తీర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగులతో అజేయంగా నిలిచి, సెంచరీ మిస్ అయ్యాడు....
58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌కి ఆఖరి ఓవర్‌లో స్ట్రైయికింగ్ దొరికి ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రివెంజ్ సెంచరీ చేసేవాడే...
210
ఉమ్రాన్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఓ సిక్స్, మూడు ఫోర్లతో 19 పరుగులు రాబట్టిన రోవ్‌మెన్ పావెల్, 92 పరుగులతో ఉన్న డేవిడ్ వార్నర్‌ని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌కే నిలబెట్టాడు...
310
David Warner
‘అందులో నా తప్పేం లేదు, ఆఖరి ఓవర్ ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ దగ్గరికి వెళ్లి... సింగిల్ తీసి ఇవ్వనా, సెంచరీ చేసుకుంటావా? అని అడిగాను..
410
దానికి వార్నర్... క్రికెట్ అలా ఆడకూడదు. నా పర్సనల్ అఛీవ్‌మెంట్ కంటే టీమ్ ముఖ్యం. షాట్స్ ఆడడానికే ట్రై చెయ్యి... అని చెప్పాడు. అందుకే నేను షాట్స్ ఆడాలని ఫిక్స్ అయ్యా...
510
ఐపీఎల్ ఆరంభానికి ముందు నాలో కొంచెం భయం ఉండేది, ఇంత పెద్ద వేదికపై సక్సెస్ అవ్వగలనా? అనే సందేహం ఉండేది. అయితే నన్ను నేను నమ్మాను. రిషబ్ పంత్‌తో అన్ని విషయాల గురించి పంచుకున్నా...
610
నన్ను 8వ స్థానంలో బ్యాటింగ్‌కి పంపడంతో చాలా డిస్సాపాయింట్ అయ్యాను. అయితే ఏ ప్లేస్‌లో ఆడడానికైనా సిద్ధగా ఉండాలి. అందుకే ఓ సారి పంత్‌తో, రికీ పాంటింగ్‌తో మాట్లాడాను...
710
నన్ను నమ్మండి, నేను ఐదో స్థానంలో బాగా ఆడగలను. మొదటి 15-20 బంతులు నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత 20 బంతుల్లో మ్యాగ్జిమం పరుగులు చేస్తానని చెప్పాను..
810
మొదటి మ్యాచుల్లో నా పర్ఫామెన్స్ చూసిన వాళ్లు, నా మాటలు నమ్మి ఆ స్థానంలో అవకాశం ఇచ్చారు...’ అంటూ చెప్పుకొచ్చాడు రోవ్‌మెన్ పావెల్...
910
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్, ఐపీఎల్‌లో 10 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 202 పరుగులు చేశాడు.
1010
సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి బయటకి వచ్చి, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న డేవిడ్ వార్నర్... 8 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 356 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు...