ఆ రోజు ధోనీ ఏడ్చేశాడు, అందుకే అది చాలా స్పెషల్ సీజన్... సీఎస్‌కే కోచ్ మైక్ హుస్సీ కామెంట్స్...

First Published May 6, 2022, 3:34 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియా కెప్టెన్‌గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో... ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా అంతకుమించి పాపులారిటీ సంపాదించుకున్నాడు. 2008 నుంచి సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగుతూ వచ్చిన ఎమ్మెస్ ధోనీ, ఆ జట్టుపై రెండేళ్లు బ్యాన్ పడడంతో వేరే టీమ్స్‌కి ఆడాల్సి వచ్చింది...

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 9 సార్లు ఫైనల్ చేరి రికార్డు క్రియేట్ చేసింది. 2020 సీజన్ మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది...
 

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం, అయితే 8 మ్యాచుల్లో 6 పరాజయాలు అందుకోవడంతో మళ్లీ ఆ పొజిషన్ నుంచి తప్పుకోవడం జరిగిపోయాయి...

Latest Videos


రవీంద్ర జడేజా సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు ఎమ్మెస్ ధోనీ. మాహీ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్‌లో గెలిచినా, రెండో మ్యాచ్‌లో ఓడిన సీఎస్‌కే... ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది...

Image Credit: Getty Images (File Photo)

2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో సీఎస్‌కే హస్తం ఉందని తేలడంతో ఆ జట్టుపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది ఐపీఎల్ యాజమాన్యం. 2016, 17 సీజన్లలో సీఎస్‌కే లేకపోవడంతో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరుపున ఆడాడు ఎమ్మెస్ ధోనీ...

‘సీఎస్‌కేలో నేను చాలా మెమొరీస్ ఉన్నాయి. అయితే ఛాంపియన్‌షిప్ విన్నింగ్ ఫోటోల్లో 2018 సీజన్ మాత్రం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే బ్యాన్ కారణంగా మేం రెండేళ్లు, ఫ్రాంఛైజీకి దూరమయ్యాం...

ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోనీ స్పీచ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ధోనీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీఎస్‌కే గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయి, ఏడ్చేశాడు...

అప్పుడే నాకు అనిపించింది, ఈ సీజన్‌లో ఏదో కొత్తగా జరగబోతోంది... అని. అది చాలా స్పెషల్ సీజన్. ఆ ఏడాది జరిగినది తలుచుకుంటేనే గూస్‌బంప్స్ వస్తుంటాయి. అది మాకు ఐపీఎల్‌లో కమ్‌బ్యాక్ సీజన్...

ఆ సీజన్‌లో ఎమ్మెస్ ధోనీ అద్భుతంగా ఆడాడు. అది మాకు చాలా స్పెషల్ టైం. ఏబీ డివిల్లియర్స్ నా ఫెవరెట్. అయితే ధోనీ కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ఇద్దరూ మిడిల్ ఆర్డర్‌లో ఆడతారు... 
 

చాలామంది లెజెండ్స్, మిడిల్ ఆర్డర్‌లో పరుగులు సాధించలేకపోయారు, ఎందుకంటే వాళ్లంతా టాపార్డర్‌లో ఆడడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఏబీ డివిల్లియర్స్ సాధించినది, చాలామంది ప్లేయర్లకు అసాధ్యమైన విషయం...

ఎందుకంటే 20 బంతుల్లో మ్యాచ్ అయిపోతుందనగా క్రీజులోకి వచ్చి 70 పరుగులు చేస్తారు. అందుకే అతనో అద్భుతం. ఎమ్మెస్ ధోనీ కూడా అంతే. ఏబీడీతో పోలిస్తే ధోనీ, లెక్కలు వేసి ఆడతాడు...

ఎమ్మెస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్ చేసిన పనిని, టీ20 చరిత్రలో ఎవ్వరూ చేయలేరు...’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్, మాజీ క్రికెటర్ మైకేల్ హుస్సీ...

ఐపీఎల్ 2016, 2017 సీజన్లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, 2018లో టైటిల్ గెలిచి రీఎంట్రీ ఇచ్చింది. 2018లో కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఫైనల్‌లో ఓడించి, మూడోసారి టైటిల్ సొంతం చేసుకుంది సీఎస్‌కే...

click me!