గంగూలీ, అజారుద్దీన్, ధోనీ... రిషబ్ పంత్‌ కెప్టెన్సీలో ఈ ముగ్గురూ కనిపిస్తున్నారు...

First Published May 3, 2022, 5:50 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో టెంపరరీ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చి, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకే ఎసరు పెట్టాడు రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఐపీఎల్ 2021 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిపిన రిషబ్ పంత్, 2022 సీజన్‌లోనూ తన కెప్టెన్సీతో ఇంప్రెస్ చేస్తున్నాడు...

ఐపీఎల్‌లో తన కెప్టెన్సీ స్కిల్స్‌తో మెప్పించిన రిషబ్ పంత్, రోహిత్ శర్మ తర్వాత టీమిండియాని నడిపించే ఫ్యూచర్ కెప్టెన్ల రేసులో నిలిచాడు..

‘టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ మంచి ఆప్షనే. అతను ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ని బాగానే నడిపించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో జట్టును నడిపించే యువ సారథిగా రాహుల్ పనికొస్తాడు...

Latest Videos


Rishabh Pant

అయితే కెఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్ చాలా బెటర్. ఎందుకంటే రిషబ్ పంత్ కెప్టెన్సీ చాలా విభిన్నంగా ఉంటుంది...

టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహ్మద్ అజారుద్దీన్, ఎమ్మెస్ ధోనీ... భిన్నంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునేవాళ్లు...

ఇప్పుడు రిషబ్ పంత్‌లో కూడా ఆ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ కనిపిస్తోంది. రిషబ్ పంత్ ఇలాగే కెప్టెన్సీ చేస్తే, ఫ్యూచర్‌లో చాలా సక్సెస్‌ఫుల్ అవుతాడు...

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా బాగుంది. అయితే అతనికి ఫిట్‌నెస్ చాలా అవసరం. ఇలాగే నిలకడగా బౌలింగ్ చేయగలిగితే వైట్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్సీకి హార్ధిక్ పాండ్యా కూడా మంచి ఆప్షన్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్...

రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడనుంది.

click me!