తండ్రి గ్యాస్‌బండి నడుపుతాడు, తమ్ముడు ఆటో డ్రైవర్, 9వ క్లాస్ ఫెయిల్... రింకూ సింగ్ కథ వింటే...

Published : May 03, 2022, 04:56 PM IST

ఐపీఎల్‌లో నాలుగు సీజన్లుగా ఆడుతున్నా, రింకూ సింగ్ ఆడింది పట్టుమని 10 మ్యాచులే. అందులో బ్యాటింగ్ఆడే అవకాశం వచ్చింది 8 మ్యాచుల్లో. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అటు ఫీల్డింగ్‌లో కళ్లు చెదిరే క్యాచులు అందుకుని, బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు రింకూ సింగ్...

PREV
19
తండ్రి గ్యాస్‌బండి నడుపుతాడు, తమ్ముడు ఆటో డ్రైవర్, 9వ క్లాస్ ఫెయిల్... రింకూ సింగ్ కథ వింటే...

సోషల్ మీడియాలో రింకూ సింగ్‌కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి ప్రధాన కారణం అతని ఫీల్డింగ్. గాల్లోకి ఎగురుతూ క్యాచులు అందుకునే రింకూ సింగ్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు క్యాచులు అందుకున్నాడు...

29

తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రెండు అద్భుతమైన క్యాచులు అందుకున్న రింకూ సింగ్, బ్యాటింగ్‌లో 23 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి... కేకేఆర్‌కి అత్యవసర విజయాన్ని అందించాడు.

39

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ఏరియాలో జన్మించిన రింకూ సింగ్ లైఫ్ స్టోరీ వింటే ఆశ్చర్యం వేయకమానదు. రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ర, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇంటింటికీ సరాఫరా చేస్తుంటారు...

49

రింకూ సింగ్ అన్న ఓ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్లంతా కలిసి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ డిస్టిబ్యూషన్ కంపెనీ క్వార్టర్స్‌‌లో ఓ రెండు గదుల్లో ఉండేవాళ్లు...
 

59

పెద్దగా చదువు అబ్బకపోవడంతో 9వ తరగతి ఫెయిల్ అయిన రింకూ సింగ్‌కి కూడా స్వీపర్ జాబ్ వచ్చింది. అయితే తన జీవితాలను మార్చేసే శక్తి క్రికెట్‌కి ఉందని నమ్మిన రింకూ సింగ్, ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు...

69

‘అలీఘర్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న మొదటి క్రికెటర్‌ని నేను, చాలామంది రంజీ ట్రోఫీ ఆడారు కానీ ఐపీఎల్ ఆడలేదు. ఇక్కడ ప్లేయర్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడాల్సి ఉంటుంది...

79

నేను సరైన అవకాశం కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా. గాయం నుంచి కోలుకుని దేశవాళీ టోర్నీల్లో రాణించడం నాకు కలిసి వచ్చింది. వేలంలో అమ్ముడుపోతానని తెలుసు, అయితే బేస్ ప్రైజ్‌కే కొంటారని అనుకున్నా...

89

నాకు రూ.80 లక్షల ధర దక్కడం ఆనందంగా అనిపించింది. ఈ డబ్బుతో అన్నయ్య పెళ్లి, అలాగే మా చెల్లెలి పెళ్లి చేయాలని అనుకుంటున్నా...

99

ఈ రోజు బ్యాటింగ్‌కి వచ్చే ముందే పక్కా బాగా ఆడాలి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవాలి అని నా చేతుల మీద రాసుకుని వచ్చా.. అనుకున్నట్టే రెండూ చేశా’ అంటూ చెప్పుకొచ్చాడు కేకేఆర్ బౌలర్ రింకూ సింగ్...

click me!

Recommended Stories