ముసలోడే కానీ..! 66 ఏళ్ల వయసులో అరుణ్ లాల్ రెండో పెళ్లి, ఘాటు ముద్దులతో...

Published : May 03, 2022, 04:21 PM IST

ప్రేమకి లేనట్టే, పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ రుజువు చేశాడు. 66 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తనకంటే 28 ఏళ్ల చిన్నదైన బుల్‌బుల్ సాహాని పెళ్లాడాడు...

PREV
19
ముసలోడే కానీ..! 66 ఏళ్ల వయసులో అరుణ్ లాల్ రెండో పెళ్లి, ఘాటు ముద్దులతో...

టీమిండియా మాజీ క్రికెటర్‌ అయిన అరుణ్ లాల్, ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

29

66 ఏళ్ల అరుణ్ లాల్, తన గర్ల్‌ఫ్రెండ్ బుల్‌బుల్ సాహాని సోమవారం మే 2న కోల్‌కత్తాలో ఘనంగా వివాహం చేసుకున్నాడు...

39

టీమిండియా తరుపున 1982లో ఎంట్రీ ఇచ్చిన అరుణ్ లాల్, 16 టెస్టులు, 13 వన్డేలు ఆడారు. మొత్తంగా 850 పరుగులు చేశారు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

49

క్రికెట్‌కి రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గానూ సేవలు అందించిన అరుణ్ లాల్, 2016లో దవడ క్యాన్సర్‌తో ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు...

59

క్యాన్సర్ నుంచి కోలుకున్న అరుణ్ లాల్, తనకి భార్యకి తోడుగా నిలిచిన 38 ఏళ్ల బుల్‌బుల్ సాహాని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, అనుకున్నట్టే ఘనంగా రెండో పెళ్లి చేసుకున్నాడు..

69

అరుణ్ లాల్ మొదటి భార్య చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో బాధపడుతున్నారు. అరుణ్ లాల్ మొదటి భార్య రీనా ఆరోగ్యం చూసుకోవడానికి బుల్‌బుల్ సాహాని నియమించాడు అరుణ్ లాల్.. రీనా ఇప్పటికీ అరుణ్ లాల్‌తోనే ఉంటుంది.

79

మొదటి భార్య అనారోగ్యంతో మంచం పట్టడంతో కొన్నాళ్లుగా బుల్‌బుల్ సాహాతో డేటింగ్ చేస్తున్న అరుణ్ లాల్, ఇప్పుడు అఫిషియల్‌గా ఆమెను పెళ్లాడాడు...

89

కోల్‌కత్తాలో జరిగిన ఈ వివాహానిరి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో బెంగాల్ క్రికెట్ టీమ్, బెంగాల్ క్రికెట్ బోర్డు నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..

99

66 ఏళ్ల వయసులో బుల్‌బుల్ సాహాని అరుణ్ లాల్ ముద్దాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ‘ముసలోడే కానీ...’ టైపులో మీమ్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

click me!

Recommended Stories