కూల్‌గా కొబ్బరిబొండాం తాగుతూ, ఫైనల్‌కి తెచ్చేశాడు... ఐపీఎల్ 2022లో బెస్ట్ కోచ్ ఆశీష్ నెహ్రా...

First Published May 25, 2022, 3:37 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి, ఫైనల్‌లో దూసుకెళ్లింది గుజరాత్ టైటాన్స్. అందులోనూ కెప్టెన్‌గా ఏ మాత్రం అంచనాలు లేని హార్ధిక్ పాండ్యాని కెప్టెన్సీ అప్పగించడంతో గుజరాత్ టైటాన్స్, ఈ సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలుస్తుందని భావించారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

సీవీసీ క్యాపిటల్స్ కొత్త ఫ్రాంఛైజీని కొనడానికి బిడ్ వేసినప్పటి నుంచి ఈ జట్టు లోగో, ఫ్రాంఛైజీ పేరు డిసైడ్ చేయడానికి చాలా ఆలస్యం చేసింది... గుజరాత్ టైటాన్స్ అంటూ విడుదల చేసిన లోగోపై కూడా ట్రోల్స్ వచ్చాయి...

Photo source- iplt20.com

అయితే సీజన్ ఆరంభమయ్యాక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకెళ్లింది టైటాన్స్. లీగ్ స్టేజీలో 10 విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి చేరిన గుజరాత్, మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ని ఓడించి ఫైనల్ చేరింది...

కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వంటి కోచ్‌లు కంప్యూటర్లలో ప్లేయర్ల గురించి స్టడీ చేస్తూ, ఎవరిని ఎలా అవుట్ చేయాలి? ఎవరిని ఆడించాలని పెద్ద పెద్ద లెక్కలే వేశారు...

అయితే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా మాత్రం సీజన్ మొత్తం చాలా కూల్ అండ్ కామ్‌గా తన పని చేసుకుంటూ పోయాడు. చిన్న పేపర్‌పై పెన్నుతో టీమ్‌ని సెలక్ట్ చేసేసిన నెహ్రా, జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిగిలిన హెడ్‌ కోచ్‌ల్లా ఆవేశంతో ఊగిపోకుండా, కంగారుపడకుండా కొబ్బరిబొండాం తాగుతూ ఛిల్ అవుతూ కనిపించాడు...

అంతేకాకుండా విజయాలు వచ్చిన తర్వాత ఎగిరి గంతులు వేయకుండా, గాల్లో ఎగురుతూ సంబరాలు చేసుకోకుండా చాలా కామ్‌గా ఉండే ఆశీష్ నెహ్రా... టీమ్ కాంబినేషన్ చెడిపోకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు...
 

ప్రతీ ప్లేయర్‌తో మాట్లాడుతూ వారికి భరోసా ఇస్తూ గుజరాత్ టైటాన్స్‌ని టాప్ టీమ్‌గా మార్చాడు ఆశీష్ నెహ్రా.. అందుకే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆశీష్ నెహ్రానే బెస్ట్ కోచ్ అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
 

Ashish Nehra

2018 సీజన్‌లో ఆర్‌సీబీకి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు ఆశీష్ నెహ్రా. అయితే 2019లో ఆ‌ర్‌సీబీ వరుసగా అరడజను మ్యాచుల్లో ఓడి ఆఖరి పొజిషన్‌లో నిలిచిన తర్వాత నెహ్రాని బౌలింగ్ కోచ్‌ పదవి నుంచి తప్పించింది ఆర్‌సీబీ...

అయితే ఈ సీజన్‌లో ఏకంగా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న ఆశీష్ నెహ్రా, అద్భుతాలే చేస్తున్నాడు. 18 ఏళ్ల తన అంతర్జాతీయ అనుభవాన్ని వాడుతూ టీమ్‌ని విజయపథంలో నడిపించడమే కాదు, ఎంతో వినయంగా సింపుల్ బిహేవియర్‌తో అందరి మనసులు దోచుకుంటున్నాడు ఆశీష్ నెహ్రా... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిస్తే, టీమిండియాలో బౌలింగ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రాకి పదవి ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేసే అవకాశం ఉంది... 

click me!