ఆ పైసల కోసం పాకిస్తానోడి షాపులో పనిచేశా... షాకింగ్ విషయాలు బయటపెట్టిన హర్షల్ పటేల్...

Published : May 03, 2022, 03:46 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా క్రేజ్ సంపాదించిన సీనియర్ మోస్ట్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్. ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి డీజే బ్రావో రికార్డును సమం చేసిన హర్షల్ పటేల్, పర్పుల్ క్యాప్ గెలిచాడు...

PREV
18
ఆ పైసల కోసం పాకిస్తానోడి షాపులో పనిచేశా... షాకింగ్ విషయాలు బయటపెట్టిన హర్షల్ పటేల్...

గత సీజన్‌లో బేస్ ప్రైజ్‌కి హర్షల్ పటేల్‌ని కొనుగోలు చేసిన ఆర్‌సీబీ, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ ధరకు అతన్ని తిరిగి దక్కించుకుంది...

28

గుజరాత్‌లో పుట్టిన హర్షల్ పటేల్, కొన్నాళ్ల పాటు యూఎస్‌ఏలో ఉన్నాడు. అక్కడ తాను అనుభవించిన కష్టాల గురించి తాజాగా బయటపెట్టాడు హర్షల్ పటేల్... 

38

‘న్యూజెర్సీలో ఓ పాకిస్తానీ పర్ఫూమ్ స్టోర్‌లో పనిచేసేవాడిని. అతను నాకు రోజుకి 35 డాలర్లు జీతంగా ఇచ్చేవాడు. నేను గుజరాతీ మీడియంలో చదువుకోవడం వల్ల నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా వచ్చేది కాదు...

48

భాష రాక అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. అయితే కొన్నాళ్లకు వారి ఇంగ్లీష్‌కి నేను అలవాటు పడ్డాను. ప్రతీ శుక్రవారం షాపుకి చాలామంది వచ్చేవాళ్లు. 100 డాలర్లు పెట్టి పర్ఫూమ్ బాటిల్స్ కొనుకునేవాళ్లు...

58

మళ్లీ సోమవారం తిరిగి వచ్చి ‘హే మ్యాన్... నేను దీన్ని కొన్నిసార్లు వాడాను. ఇప్పుడు రిటర్న్ ఇచ్చేయాలని అనుకుంటున్నా. తినడానికి నా దగ్గర డబ్బులు లేవు...’ అని చెప్పేవాళ్లు. ఇలా ప్రతీ వారం జరిగేది...

68

అదో వింత అనుభవం. మా అంకుల్, ఆంటీ నన్ను దారిలో దింపేసి ఆఫీసులకు వెళ్లేవాళ్లు. దాంతో ఉదయం 7 గంటలకు షాపుకి వెళితే మళ్లీ రాత్రి  9 గంటల దాకా అక్కేడ ఉండేవాడిని...

78

ఓ రెండు గంటలు ఎలిజబెత్ రైల్వే స్టేషన్‌లో కూర్చునేవాడిని. చిన్నతనంలో జూనియర్ క్రికెట్ ఆడేవాడిని. జీవితాన్ని నాశనం చేసే ఏ పనీ చేయవద్దని అమ్మానాన్న చెప్పేవాళ్లు. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నా.

88
Harshal Patel

ప్రతీ రోజు ఉదయం 7 గంటలకు ప్రాక్టీస్‌కి వెళ్లేవాడిని. ఆకలి వేస్తే అక్కడే శాండ్‌విచ్ తినేవాడిని. రోస్టెడ్ అయితే రూ.15. అందుకే రూ.7లకు ఆలూ మటర్ శాండ్‌విచ్ తినేవాడిని...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్షల్ పటేల్...

click me!

Recommended Stories