అవకాశం వస్తే ఆ టీమ్‌కి ఆడతా... మనసులో మాట బయటపెట్టిన రవిచంద్రన్ అశ్విన్...

Published : Dec 18, 2021, 04:45 PM IST

ఐపీఎల్‌లో ఎన్ని టీమ్స్ ఉన్నా, సొంత టీమ్‌కి ఆడడంలో ఉన్న సంతృప్తి వేరు. అయితే భారత ప్రీమియర్ లీగ్‌లో అతికొద్ది మంది ప్లేయర్లకు మాత్రమే సొంత జట్టు తరుపున ఆడే అవకాశం దొరుకుతోంది. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ కూడా తన సొంత టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు...

PREV
112
అవకాశం వస్తే ఆ టీమ్‌కి ఆడతా... మనసులో మాట బయటపెట్టిన రవిచంద్రన్ అశ్విన్...

గత సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి, సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న దినేశ్ కార్తీక్ కూడా సీఎస్‌కే తరుపున ఆడాలని అనుకున్నట్టు కామెంట్ చేసిన విషయం తెలిసిందే...

212

14 ఏళ్లుగా చెన్నై తరుపున ఆడే ఛాన్స్ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నానని, అయితే మొదటి సీజన్‌లో ఎమ్మెస్ ధోనీని తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పటిదాకా తనకు అవకాశం ఇవ్వలేదని కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...

312

తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చెన్నై సూపర్స్ కింగ్స్ తరుపున ఆడాలని ఆశపడుతున్నట్టు మనసులో మాట బయటపెట్టాడు...

412

కెరీర్ ఆరంభంలో 2008 నుంచి 2015 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, సీఎస్‌కేలో పర్ఫామెన్స్ కారణంగానే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు...

512

2015లో సీఎస్‌కే అశ్విన్‌ని వేలానికి విడుదల చేయగా, ఆ తర్వాత రెండు సీజన్లు రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, ఆ తర్వాత రెండేళ్లు పంజాబ్ కింగ్స్, గత రెండేళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు...

612

2021 సీజన్‌లో 13 మ్యాచుల్లో 7 వికెట్లు తీసిన అశ్విన్, 2020 సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు... 2011లో సీఎస్‌కే తరుపున 20 వికెట్లు తీయడమే అశ్విన్ బెస్ట్ ఐపీఎల్ పర్ఫామెన్స్‌గా ఉంది...

712

‘సీఎస్‌కే నా సొంత జట్టులాంటిది. ఎందుకంటే నాకు అది స్కూల్ లాంటిది. నేను అక్కడే ఎల్‌కేజీ, యూకేజీ, ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్‌తో పాటు హై క్లాస్, 10వ తరగతి పరీక్షలు కూడా అక్కడే రాశాను...

812

ఆ తర్వాత ఇంటర్ వేరే ఫ్రాంఛైజీలో, డిగ్రీ మరో కాలేజీలో చేసినట్టు వేర్వేరే జట్లకి ఆడాను. ఎన్ని టీమ్స్‌కి ఆడినా అవి సొంతజట్లలా అనిపించవు కదా...

912

అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నా. అయితే అవన్నీ వేలంలో లెక్కల మీద ఆధారపడి ఉంటాయి... ఈ సారి 10 టీమ్స్ ఉండబోతున్నాయి...

1012

10 జట్లూ కూడా 10 భిన్నమైన లెక్కలతోనే వేలానికి వస్తాయి. అందరికీ అందరూ భిన్నంగా ఆలోచిస్తారు. ఏ జట్టులో మనం ఫిట్‌ అవుతామో తెలీదు...

1112

అయితే ఏ టీమ్‌కి వెళ్లినా నూటికి నూరు శాతం ఎఫెక్ట్స్ ఇవ్వడమే నా కర్తవ్యం. ఎందుకంటే ప్రతీ ఫ్రాంఛైజీ కూడా ఆ అంచనాలతోనే కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధపడతాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

1212

35 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌లను కూడా వేలానికి విడుదల చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు...

click me!

Recommended Stories