ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు అంత సీన్ లేదు... షేన్ వార్న్ చెప్పిన ఇండియా ఆల్‌టైం బెస్ట్ లిస్టులో...

Published : Jan 13, 2022, 03:40 PM IST

ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ.... ఒకరు టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన సారథి కాగా, మరొకరు భారత జట్టును టెస్టుల్లో వరుసగా ఐదేళ్లు నెం.1గా నిలిపిన కెప్టెన్! ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో వీరికి పోటీ వచ్చేవాళ్లు లేరు. అయినా ఎమ్మెస్ ధోనీ, కోహ్లీలకు ఆల్‌టైం బెస్ట్ టీమిండియాలో చోటు దక్కలేదు...

PREV
19
ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు అంత సీన్ లేదు... షేన్ వార్న్ చెప్పిన ఇండియా ఆల్‌టైం బెస్ట్ లిస్టులో...

ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రకటించిన ఆల్‌టైం బెస్ట్ ఇండియా ఎలెవన్‌ లిస్టులో ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కలేదు...

29

‘నేను కేవలం ఎవరితో అయితే ఆడానో వారిలో బెస్ట్ ప్లేయర్లను సెలక్ట్ చేస్తున్నా. అందుకే ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు నా లిస్టులో చోటు ఇవ్వలేదు. ధోనీ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయితే కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ గ్రేట్ బ్యాట్స్‌మెన్...’ అంటూ చెప్పుకొచ్చాడు షేన్ వార్న్...

39

వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు నవ్‌జోత్ సింగ్ సిద్ధూకి ఓపెనర్‌గా అవకాశం కల్పించాడు షేన్ వార్న్. ‘నేను నవ్‌జోత్ సింగ్ సిద్ధూని సెలక్ట్ చేయడానికి కారణం అతను స్పిన్‌‌ను చక్కగా ఆడగలడు. నాతో పాటు ముత్తయ్య మురళీధరన్ వంటి చాలామంది స్పిన్నర్లు కూడా సిద్ధూ గురించి ఇదే మాట చెప్పారు...’ అని తెలిపాడు షేన్ వార్న్...

49

‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి షేన్ వార్న్ ఆల్‌టైం ఇండియా ఎలెవన్‌లో చోటు దక్కింది. సచిన్‌తో పాటు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ని కూడా ఆల్‌టైం టీమిండియా ఎలెవన్‌లో చోటు కల్పించాడు వార్న్...

59

తన టీమ్‌కి సౌరవ్ గంగూలీని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు షేన్ వార్న్. ‘గంగూలీ కెప్టెన్సీ అంటే నాకెంతో ఇష్టం. అందుకే కెప్టెన్‌గా అతన్ని ఎంచుకోవడంతో వీవీఎస్ లక్ష్మణ్‌కి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాను’ అని కామెంట్ చేశాడు వార్న్...

69

‘ది గ్రేట్ వాల్’ రాహుల్ ద్రావిడ్‌తో పాటు మాజీ భారత కెప్టెన్ కపిల్‌దేవ్‌ను ఆల్‌రౌండర్‌గా తన ఆల్‌టైం టీమిండియా ఎలెవన్‌లో చోటు కల్పించాడు షేన్ వార్న్...

79

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా మాజీ క్రికెటర్ నయన్ మోంగియాకి చోటు ఇచ్చిన షేన్ వార్న్‌, అతనితో పాటు హర్భజన్ సింగ్‌కి తన టీమ్‌లో ప్లేస్ ఇచ్చాడు...

89

భారత మాజీ పేసర్ జవగళ్‌ శ్రీనాథ్‌తో పాటు అనిల్ కుంబ్లేకి షేన్ వార్న్, ఆల్‌టైం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది...

99

షేన్ వార్న్‌ ఆల్‌టైం ఇండియా ఎలెవన్ ఇది: వీరేంద్ర సెహ్వాగ్, నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ (కెప్టెన్), రాహుల్ ద్రావిడ్, కపిల్ దేవ్, నయన్ మోంగియా, హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే

Read more Photos on
click me!

Recommended Stories