19 ఏళ్లప్పుడు పట్టుకొచ్చారు, ఆ తర్వాత ఐదేళ్ల పాటు పనికి రానని... సంజూ శాంసన్ ఎమోషనల్ జర్నీ...

First Published May 3, 2022, 6:25 PM IST

ఐపీఎల్‌లో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న యంగ్ భారత క్రికెటర్లలో సంజూ శాంసన్ ఒకడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సంజూ శాంసన్, ఈ సీజన్‌లో ఆర్‌ఆర్‌ని మంచి పొజిషన్‌లోనే నిలబెట్టాడు... 10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న ఆర్ఆర్, మరో రెండు మ్యాచులు గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది...

2013లో రాజస్థాన్ రాయల్స్‌ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్, ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ (క్యాపిటల్స్) జట్టుకి ఆడాడు. 2018 నుంచి తిరిగి రాజస్థాన్‌కి ఆడుతున్నాడు...

2015లో అంతర్జాతీయ స్థాయిలో టీ20 ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, వన్డే ఆరంగ్రేటం చేయడానికి మరో 6 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది...

Latest Videos


Sanju Samson

ఎమ్మెస్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ కోసం వెతుకులాట మొదలెట్టినప్పుడే రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌కి కూడా ఆడపాదడపా అవకాశాలు వచ్చాయి...

Sanju Samson

‘2015లో టీమిండియాకి ఆరంగ్రేటం చేసినప్పుడు నాకు 19 ఏళ్లు. ఆరంగ్రేటం చేసిన తర్వాత మరో ఐదేళ్ల పాటు పట్టించుకోలేదు. తిరిగి 25 ఏళ్లకు టీమిండియాలో ఛాన్స్ ఇచ్చారు...

ఆ మధ్యలో ఉన్న ఐదేళ్లు, నా కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయం. పర్ఫామెన్స్ బాగోలేదని నన్ను కేరళ టీమ్ నుంచి కూడా తప్పించారు. ఫామ్ లేదు, పరుగులు రావట్లేదు, అవకాశాలు దొరకడం లేదు... ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సమస్యలు...

ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు సర్వసాధారమే అనుకుంటా కానీ నాకు కొంచెం ముందుగానే వచ్చాయి. అయితే నేను ఎప్పుడూ నా టైం వస్తుందనే ఎదురుచూశా... నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని...

కెరీర్ ఆరంభంలో షాట్స్ ఆడాలనే ఆతృత. తొందరగా అవుట్ అయ్యేవాడిని. నాపైన నాకే కోపం, విసుగు వచ్చేవి. ఓ మ్యాచ్‌లో నేను అవుట్ అవ్వగానే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి బలంగా బ్యాటును విసిరి కొట్టాను...

అప్పటికి మ్యాచ్ ఇంకా అయిపోలేదు, కానీ నేను బయటికి వచ్చేశాడు. స్టేడియం పక్కనే సముద్రం. అక్కడే కూర్చొని చాలా ఆలోచించా. క్రికెట్ వదిలేసి, కేరళ వెళ్లిపోయి ఏదో ఒక పని చేసుకుందామనుకున్నా...

అయితే ఆ సముద్రపు అలలను చూస్తూ 2 గంటలసేపు ఆలోచించి తిరిగి వచ్చా. డ్రెస్సింగ్ రూమ్‌లో నా బ్యాట్ విరిగి పడి కనిపించింది. అప్పటి నుంచి నా కోపాన్ని నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టా...’ అంటూ చెప్పుకొచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్...

టీమిండియా తరుపున 13 టీ20 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, 14.50 సగటుతో కేవలం 174 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు 39 పరుగులు మాత్రమే...

కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ని నడిపిస్తున్న సంజూ శాంసన్, తన కెప్టెన్సీ స్కిల్స్‌తో క్రికెట్ విశ్లేషకులను కూడా మెప్పించాడు. ఈ సీజన్‌లో ఆర్ఆర్ ప్లేఆఫ్స్ చేరితే మూడు సీజన్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌ని సెమీస్ చేర్చిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు సంజూ శాంసన్..

click me!