ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు జోస్ బట్లర్. సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, 2016లో విరాట్ కోహ్లీ చేసిన మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు జోస్ బట్లర్. సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, 2016లో విరాట్ కోహ్లీ చేసిన మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు...
28
Image credit: PTI
ఒకే సీజన్‌లో 800+ పరుగులు చేసిన మూడో బ్యాటర్ జోస్ బట్లర్. ఇంతకుముందు 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ ఇద్దరూ ఈ ఫీట్ సాధించారు...
38
2016 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 81.08 సగటుతో 973 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 17 మ్యాచులు ఆడి 60.57 సగటుతో 848 పరుగులు చేశాడు...
48
Image credit: PTI
డేవిడ్ వార్నర్ రికార్డుకి 24 పరుగుల దూరంలో నిలిచిన జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ రికార్డు కొట్టాలంటే ఫైనల్ మ్యాచ్‌లో 150+ పరుగులు చేయాల్సి ఉంటుంది...
58
Image credit: PTI
2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 169 డాట్ బాల్స్ ఆడితే, జోస్ బట్లర్ ఇప్పటికే 217 డాట్ బాల్స్ ఆడేశాడు. అలాగే ఆ సీజన్‌లో విరాట్ 291 సింగిల్స్ తీస్తే, జోస్ బట్లర్ ఈ సీజన్‌లో తీసింది 170 సింగిల్స్ మాత్రమే..
68
Image credit: PTI
ఇవన్నీ పక్కనబెడితే రాజస్థాన్ రాయల్స్‌ని ఓ సెంటిమెంట్ భయపడుతోంది. 800+ పరుగులు చేసిన జోస్ బట్లర్, ఆరెంజ్ క్యాప్ రేసులోనే కాదు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ రేసులోనూ టాప్‌లో దూసుకుపోతున్నాడు...
78
Image credit: PTI
ఇప్పటిదాకా 2010లో సచిన్ టెండూల్కర్, 2011లో క్రిస్ గేల్, 2016లో విరాట్ కోహ్లీ మాత్రమే ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు గెలిచారు...
88
Image credit: PTI
అయితే యాదృచ్ఛికంగా ఈ ముగ్గురూ కూడా తమ జట్లకి ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయారు. జోస్ బట్లర్ ఈ ముగ్గురి జాబితాలో నిలుస్తాడా? లేక ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌తో పాటు టైటిల్ గెలిచిన టీమ్ సభ్యుడిగా నిలిచి చరిత్ర సృష్టిస్తాడా.. ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోనుంది...