అతడు చాలా స్పెషల్.. కోహ్లితో సమానంగా నిలుస్తాడు.. పాక్ కెప్టెన్ ను ప్రశంసించిన టీమిండియా వికెట్ కీపర్

Published : May 27, 2022, 06:47 PM IST

Dinesh Karthik Praised Babar Azam: పాకిస్తాన్ కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న  బాబర్ ఆజమ్ పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ప్రస్తుతం ఐపీఎల్ లో  ఆర్సీబీ తరఫున ఆడుతున్న  దినేశ్ కార్తీక్  ప్రశంసలు కురిపించాడు. 

PREV
16
అతడు చాలా స్పెషల్.. కోహ్లితో సమానంగా నిలుస్తాడు.. పాక్  కెప్టెన్ ను ప్రశంసించిన టీమిండియా వికెట్ కీపర్

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ చాలా ప్రత్యేకమైన  ఆటగాడని..  భవిష్యత్  లో అతడు కోహ్లితో సమానంగా నిలుస్తాడని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు.  
 

26

ఐసీసీ రివ్యూ షో లో భాగంగా  కార్తీక్ మాట్లాడుతూ.. ‘బాబర్ ఆజమ్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. తన బ్యాటింగ్ పరాక్రమం గరిష్ట స్థాయికి మరింత ఉన్నత స్థితి కి చేర్చే ఆట అతడు ఆడతాడు. 

36

మూడు ఫార్మాట్లలో ఆజమ్ అసాధారణంగా ఆడుతున్నాడు. పాకిస్తాన్ లో అతడికి  విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటివరకు మనం ఫ్యాబ్ 4 (విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్,  కేన్ విలియమ్సన్) గురించే మాట్లాడాకున్నాం.

46

కానీ బాబర్ ఆజమ్ దానిని ఫ్యాబ్ 5 చేస్తాడు. అందులో  అనుమానమే అక్కర్లేదు. ఆజమ్ ఆడుతున్నప్పుడు నాకు అతడిలో రెండు విషయాలు భాగా నచ్చుతాయి.  బ్యాలెన్స్,  బంతిని కొట్టే విధానం. ఫ్రంట్ ఫుట్ అయినా బ్యాక్ ఫుట్ అయినా  అద్భుతంగా ఆడగల సామర్థ్యం అతడిలో ఉంది..’ అని తెలిపాడు.

56

babar azam

అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు టెక్నిక్  ను మెరుగుపరుచుకుంటూ ఆడాల్సి ఉంటుందని..  బ్యాటర్ విజయవంతం కావాలంటే  ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కార్తీక్ అన్నాడు.  ఆ దిశగా  బాబర్ ఆజమ్ అద్భుతాలు సృష్టించగలడని కార్తీక్ కొనియాడాడు.  

66

పాకిస్తాన్ తరఫున ఇప్పటివరకు 40 టెస్టులు, 86 వన్డేలు, 74 టీ20 లు ఆడిన ఆజమ్  మొత్తంగా 9,800 కు పైగా పరుగులు సాధించాడు. టెస్టులలో అతడి సగటు 46 గా ఉండగా.. టీ20 లలో 45.5 గా ఉంది. ఇక వన్డేలలో 59.18 గా  నమోదైంది.  గత రెండేండ్లుగా ఆజమ్ అరవీర భయంకర ఫామ్ లో ఉన్నాడు. 

click me!

Recommended Stories