అది జరిగితే, అతని పేరు చరిత్ర పుస్తకాల్లో చేరుతుంది... రిషబ్ పంత్‌పై వీరేంద్ర సెహ్వాగ్...

First Published May 27, 2022, 8:17 PM IST

రిషబ్ పంత్ కెరీర్‌ని రెండు విడదీస్తే బ్రిస్బేన్ టెస్టుకి ముందు, తర్వాత అని ఉంటుందేమో. గబ్బా టెస్టు మ్యాచ్‌కి ముందు భారత జట్టు మూడు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన రిషబ్ పంత్, ఆఖరి ఇన్నింగ్స్‌లో మ్యాచ్ విన్నింగ్స్ నాక్‌తో సూపర్ స్టార్‌గా మారిపోయాడు...

Rishabh Pant, Brisbane Test

బ్రిస్బేన్ టెస్టు ఇన్నింగ్స్ తర్వాత మూడు ఫార్మాట్లలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్... ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కూడా అందుకున్నాడు...

Rishabh Pant

సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌ టూర్‌లో జరిగే టెస్టు, టీ20, వన్డే సిరీస్‌ కూడా ఆడబోతున్నాడు...

Rishabh Pant

టీ20, వన్డేల సంగతి ఎలా ఉన్నా, రిషబ్ పంత్‌ని టెస్టుల్లో లెజెండరీ క్రికెటర్‌గా చూడాలని కోరుకుంటున్నట్టు కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

‘రిషబ్ పంత్‌ 100కి పైగా టెస్టులు ఆడితే, అతని పేరు చరిత్ర పుస్తకాల్లో కచ్ఛితంగా చేరుతుంది. ఇప్పటిదాకా కేవలం 11 మంది భారత క్రికెటర్లు మాత్రమే నూరు టెస్టులు ఆడారు... ఆ 11 మంది పేర్లు అందరికీ గుర్తిండిపోయాయి...

నా ఉద్దేశంతో టీ20, వన్డేలు వచ్చినా టెస్టు క్రికెట్ గొప్పదనం తరగలేదు, చెదరలేదు. అందుకే విరాట్ కోహ్లీ కూడా టీ20ల కంటే టెస్టులు ఆడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు...

నాకు తెలిసి విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో  150 టెస్టులు ఆడతాడు. 200 టెస్టులు కూడా ఆడగలడేమో. అదే జరిగితే క్రికెట్‌లో విరాట్ అసాధారణ రికార్డులు క్రియేట్ చేస్తాడు...’ అంటూ స్పోర్ట్స్ 18 ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

టీమిండియా తరుపున 101 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ, 49.95 సగటుతో 8043 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి...

click me!