నేను ఆ టీమ్‌కి ఆడాల్సింది, కానీ అతని వల్ల ఛాన్స్ రాలేదు... విరాట్ కోహ్లీ కామెంట్...

Published : Feb 03, 2022, 06:37 PM IST

ఐపీఎల్ చరిత్రలో 15 సీజన్లుగా ఒకే ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగుతూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ...

PREV
113
నేను ఆ టీమ్‌కి ఆడాల్సింది, కానీ అతని వల్ల ఛాన్స్ రాలేదు... విరాట్ కోహ్లీ కామెంట్...

ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ,  6 వేలకు పైగా ఐపీఎల్ పరుగులు చేసిన ప్లేయర్‌గానూ టాప్‌లో నిలిచాడు...

213

‘అండర్‌-19 వరల్డ్‌కప్ కోసం మేమంతా మలేషియాలో ఉన్నాం. నన్ను ఐపీఎల్‌కి ఎంపిక చేసిన రోజు, నాకు ఇప్పటికీ గుర్తుంది...

313

అండర్-19 రోజులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. టీమిండియాకి ఆడకపోతే, మాకు ఇచ్చే విలువ ఎంతో అప్పుడే నాకు అర్థమైంది... 

413

డ్రాఫ్ట్‌లుగా ఫ్రాంఛైజీలు టీమ్స్‌ని సెలక్ట్ చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరు పేరు వస్తుంటే మేం అరుస్తూ, కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం... 

513

నిజంగా మాకు అంత డబ్బు ఇస్తున్నారంటే నమ్మలేకపోయాం. నిజానికి నేను ఢిల్లీ టీమ్‌కి ఆడాల్సింది. ఢిల్లీ ప్లేయర్‌ని కావడంతో వాళ్లు నన్ను కొనాలని అనుకున్నారు...

613

నేను కూడా ఢిల్లీవాసుడిని కావడంతో అదే టీమ్ అయితే బాగుంటుందని అనుకున్నా. అయితే వాళ్లు బ్యాట్స్‌మెన్ కంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కూడా ఎక్కువగా చూస్తున్నారు...

713

అప్పుడు మా టీమ్‌లో ఉన్న ప్రదీప్ సంగ్వాన్‌ అద్భుతమైన బౌలర్. ఢిల్లీ జట్టు, బౌలింగ్ యూనిట్‌ను బలంగా మార్చుకునేందుకు ప్రదీప్‌ సంగ్వాన్‌ని సెలక్ట్ చేసుకుంది...

813

ఆర్‌సీబీ నన్ను ఎంచుకుంది. ఇప్పుడు ఆ రోజులను గుర్తుచేసుకుంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నా జీవితాన్ని మార్చేసిన క్షణాలవి...

913

ఇప్పడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఢిల్లీకి ఆడి ఉంటే ఎలా ఉండేదా? అని కూడా ఆలోచిస్తూ ఉంటాను...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

1013

ఐపీఎల్ 2008 ప్రారంభ సీజన్‌లో అండర్-19 టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీని కేవలం రూ.12 లక్షలకు (30 వేల డాలర్లు) కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

1113

మూడేళ్ల తర్వాత 2011 నుంచి రూ. 8.28 కోట్లు, 2014 నుంచి రూ.12.5 కోట్లు తీసుకున్న విరాట్ కోహ్లీ, 2018 నుంచి 2021 వరకూ రూ.17 కోట్లు తీసుకున్నాడు...

1213

ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం తీసుకున్న ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీని రూ.16 కోట్లకు తిరిగి రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

1313

కోహ్లీ స్థానంలో ఢిల్లీ జట్టుకి వెళ్లిన ప్రదీప్ సంగ్వాన్, ఐపీఎల్‌లో 5 మ్యాచులు ఆడి 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత కేకేఆర్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకి మారినా కెరీర్ మాత్రం మారలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories