వాళ్లు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు, మేం గెలిచాం... గబ్బా టెస్టుపై శుబ్‌మన్ గిల్...

Published : Feb 03, 2022, 06:01 PM IST

ఆస్ట్రేలియా టూర్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్లలో శుబ్‌మన్ గిల్ ఒకడు. మొదటి టెస్టులో పృథ్వీషా ఫెయిల్ కావడంతో ఆ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్, మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు...

PREV
111
వాళ్లు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు, మేం గెలిచాం... గబ్బా టెస్టుపై శుబ్‌మన్ గిల్...

తన ఆరంగ్రేట టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 45, రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్, ఆ తర్వాతి టెస్టులో హాఫ్ సెంచరీ బాదాడు...

211

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

311

అయితే గబ్బా టెస్టులో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు శుబ్‌మన్ గిల్. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే అవుటైనా, రెండో ఇన్నింగ్స్‌లో కంగారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు...

411

రోహిత్ శర్మ 7 పరుగులకే అవుటైనా పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్ 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు...

511

328 పరుగుల లక్ష్యఛేదనలో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్ క్రెడిట్ మొత్తం కొట్టేసినా... కీలక దశలో 91 పరుగులతో అదరగొట్టిన శుబ్‌మన్ గిల్ పాత్ర కూడా గబ్బా టెస్టు విజయంలో ఎంతో ఉంది...

611

‘గబ్బాలో వారికి 32 ఏళ్లుగా ఎదురులేదు. ఏ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అది కూడా ఐదో రోజు కావడం, 320+ టార్గెట్ ఉండడంతో వాళ్లు ఈజీగా గెలుస్తామని ఫిక్స్ అయిపోయారు...

711

ఐదో రోజు ఉదయం నుంచి సెలబ్రేషన్స్‌కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే కాస్త రిలాక్స్ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఆరంగ్రేటం చేయడమంటే అతిపెద్ద ఛాలెంజ్‌ను ఫేస్ చేయడమే... 

811

అయితే నేను ఆ ఛాలెంజ్ స్వీకరించాలని అనుకున్నా. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ షార్ట్ బాల్స్ వేస్తున్నట్టు నేను రివర్స్ అటాక్ చేయాలని ఫిక్స్ అయ్యాను...

911

అయితే కమ్మిన్స్ పక్కా లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేస్తున్ానడు. అందుకే స్టార్క్‌ బౌలింగ్‌లో బౌండరీలు కొట్టాలని ఫిక్స్ అయ్యా. రెండు ఎండ్స్‌ నుంచి పరుగులు వచ్చినా, ప్రమాదమే...

1011

ప్రత్యర్థి ప్లాన్ మార్చేస్తారు. అందుకే ఒక్కరినే టార్గెట్ చేయాలని అనుకున్నా. అందుకే స్టార్క్ బౌలింగ్‌లో పుల్ షాట్స్ ఆడాను. టాప్ ఎడ్జ్ తగిలినా బౌండరీ వస్తుందని గ్రహించే అలా చేశా...

1111

కమ్మిన్స్ బౌలింగ్ ఎండ్‌లో బౌండరీ పెద్దదిగా కూడా ఉంది. అయితే ఆ రోజు సెంచరీ మిస్ అవ్వడం కాస్త బాధను కలిగించింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు శుబ్‌మన్ గిల్...

Read more Photos on
click me!

Recommended Stories