కెప్టెన్సీ చేయడమంటే అనుకున్నంత ఈజీ కాదు... ఎమ్మెస్ ధోనీ నిర్ణయంపై ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

Published : Mar 26, 2022, 06:19 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏకంగా నాలుగు టీమ్స్ కొత్త కెప్టెన్లతో బరిలో దిగబోతున్నాయి. మయాంక్ అగర్వాల్, హార్ధిక్ పాండ్యా, ఫాఫ్ డుప్లిసిస్‌తో పాటు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రవీంద్ర జడేజా సీఎస్‌కే కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు...

PREV
17
కెప్టెన్సీ చేయడమంటే అనుకున్నంత ఈజీ కాదు... ఎమ్మెస్ ధోనీ నిర్ణయంపై ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఫోర్ టైమ్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

27

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు, ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్...

37

‘ఎమ్మెస్ ధోనీ తీసుకున్న నిర్ణయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. నిజానికి మాహీ తీసుకున్న నిర్ణయం నాకు సంతోషాన్నిచ్చింది...

47

మాహీ చాలా ఏళ్ల నుంచి కెప్టెన్సీ భారాన్ని మోస్తున్నాడు. చాలామంది కెప్టెన్‌గా ఉండడమంటే చాలా ఈజీ అని అనుకుంటారు. కానీ అది మనల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది...

57

కొన్నిసార్లు నిద్రలేని రాత్రులను గడపాల్సి ఉంటుంది. ఏదైనా సీజన్‌లో టీమ్ పర్ఫామెన్స్ బాగోలేకపోతే... ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోలింగ్‌, విమర్శలను భరించలేం... 

67

కానీ ఎమ్మెస్ ధోనీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా టైటిల్ గెలిచిన తర్వాత తప్పుకోవడం కంటే మంచి మూమెంట్ ఇంకేముంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్...

77

ఫ్రాంఛైజీ క్రికెట్‌కి రాజీనామా ఇవ్వడంతో ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరంగా ఉంటున్నాడు ఏబీ డివిల్లియర్స్. ‘ఐపీఎల్‌నీ, ఆర్‌సీబీనీ, విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నా. ఈసారి సౌతాఫ్రికా నుంచే వారికి సపోర్ట్ చేస్తా...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీడీ...

Read more Photos on
click me!

Recommended Stories