TATA IPL2022 Live Updates: టీమిండియా వికెట్ కీపర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్ పై ఆ జట్టు హెడ్ కోచ్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ కూడా హిట్ మ్యాన్ బాటలోనే నడుస్తున్నాడని, అతడికి భారత కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పితే...
ఢిల్లీ క్యాపిటల్స్ సారథి, భావి భారత కెప్టెన్ గా ఊహాగానాలు వస్తున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆకాశానికెత్తాడు. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తర్వాత భారత క్రికెట్ ను విజయవంతంగా నడిపే సామర్థ్యం పంత్ కు ఉన్నదని పాంటింగ్ చెప్పాడు.
29
ఐపీఎల్ లో ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో పాంటింగ్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు పంత్ పై ప్రశంసలు కురిపించాడు.
39
పాంటింగ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ వంటి హై ఓల్టేజీ టోర్నీలో కొంత అనుభవం ఉన్నందున రాబోయే రోజుల్లో రిషభ్ పంత్ అంతర్జాతీయ స్థాయి లో కెప్టెన్ గా విజయవంతమవుతాడు. అందులో నాకు ఎటువంటి సందేహం లేదు.
49
పంత్ లో కూడా హిట్ మ్యాన్ కు ఉన్న లక్షణాలే ఉన్నాయి. రోహిత్ తో అతడికి చాలా పోలికలున్నాయి. రోహిత్ ముంబై బాధ్యతలు స్వీకరించినప్పుడు యువకుడు. రిషభ్ కు సమానమైన వయసులోనే హిట్ మ్యాన్ ముంబై సారథిగా వచ్చాడు. ఆ తర్వాత రోహిత్ ఐదు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడు అతడు భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో నాయకుడిగా ఉన్నాడు.
59
ఒక నిజం చెప్పాలంటే ఈ ఇద్దరూ (పంత్, రోహిత్) చాలా సారూప్యత గల వ్యక్తులు. వాళ్లిద్దరూ గొప్ప సహచరులని నాకు తెలుసు. మ్యాచులు జరుగుతుండగా నాయకత్వం, వ్యూహాలు ఇతర విషయాలను కూడా పంచుకుంటుంటారు.
69
ముంబై ఇండియన్స్ లో రోహిత్ సాధించినదానిని ఢిల్లీ క్యాపిటల్స్ లో పంత్ కూడా సాధిస్తాడని నేను నమ్ముతున్నాను. రిషభ్ ప్రయాణం కూడా హిట్ మ్యాన్ ను పోలి ఉండే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి..’ అని పాంటింగ్ చెప్పాడు.
79
అంతేగాక.. భవిష్యత్తులో పంత్ కు భారత సారథ్య బాధ్యతలు అప్పజెప్పితే అతడు విజయవంతమైన సారథి అవుతాడని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
89
‘ఇక్కడ (ఢిల్లీ క్యాపిటల్స్) నేను ఐదు సీజన్లుగా కోచ్ గా పనిచేస్తున్నాను. రిషభ్ ఎదుగుదలను నేను దగ్గర్నుంచి చూస్తున్నాను. ఒక ఆటగాడిగానే గాక వ్యక్తిగా కూడా రోజురోజుకూ పరిణితి సాధిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భారత జట్టు తరఫున ఆడుతూ అతడికి అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తున్నాడు. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా విజయవంతమైనట్టు.. టీమిండియాకు కూడా విజయవంతమైన సారథి అవుతాడు...’ అని చెప్పాడు.
99
గతేడాది శ్రేయస్ అయ్యర్ కు గాయం కావడంతో ఢిల్లీ యాజమాన్యం రిషభ్ పంత్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది. అయితే అయ్యర్ తిరిగొచ్చినా పంత్ నే కెప్టెన్ గా కొనసాగించింది ఢిల్లీ. రిటెన్షన్ ప్రక్రియలో కూడా ఆ జట్టు పంత్ నే రిటైన్ చేసుకున్నది. దీంతో అయ్యర్.. వేలానికి వెళ్లాడు. ఇప్పుడు అతడు కోల్కతా నైట్ రైడర్స్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు.