ఎమ్మెస్ ధోనీకి చాలా పొగరు, టీమ్ మీటింగ్స్‌కి వచ్చేవాడు కాదు... సలహాలు ఇవ్వొద్దని కోచ్‌కి వార్నింగ్...

Published : Mar 26, 2022, 05:24 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ కూడా. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎమ్మెస్ ధోనీ, సీఎస్‌కేని 11 సార్లు ప్లేఆఫ్స్‌కి, 9 సార్లు ఫైనల్స్‌కి చేర్చాడు. అయితే రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌లో మాత్రం మాహీకి చేదు అనుభవమే ఎదురైంది..

PREV
111
ఎమ్మెస్ ధోనీకి చాలా పొగరు, టీమ్ మీటింగ్స్‌కి వచ్చేవాడు కాదు... సలహాలు ఇవ్వొద్దని కోచ్‌కి వార్నింగ్...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం పడిన రెండేళ్లు (2016, 2017) రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు తరుపున ఆడాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

211

2016 సీజన్‌లో మాహీ కెప్టెన్సీలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. దీంతో తర్వాతి సీజన్‌లో మాహీని కెప్టెన్సీ నుంచి తప్పించిన పూణే, స్టీవ్ స్మిత్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించింది...

311

స్టీవ్ స్మిత్ ఆన్ కార్డ్ కెప్టెన్‌గా ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీ ఆన్ ఫీల్డ్ కెప్టెన్‌గా జట్టును నడిపించేవాడనేది అందరికీ తెలిసిన రహస్యమే. 2017లో ఫైనల్ చేరిన పూణే, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది...

411

2016లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ టీమ్‌కి పర్ఫామెన్స్ అనాలిసిస్ట్ కోచ్‌గా ఎంపికైన ప్రసన్న అఘోరామ్, ఎమ్మెస్ ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...

511

‘ఐపీఎల్ 2016లో ఎమ్మెస్ ధోనీతో కలిసి రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌కి పనిచేసే అవకాశం దొరికినప్పుడు చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. అప్పటికే మాహీ గురించి చాలా విన్నాను. ఆయన విజయాలను చూశాను...

611

మొదటిసారి పూణే స్టేడియంలో మాహీని కలిసినప్పుడు, ఆయన ప్యాడ్స్ వేసుకున్నాడు. నన్ను చూసి, ఫిల్డర్ కాఫీ తాగుతారా అని అడిగాడు. నేను సరే అన్నాను. అక్కడున్న వారిని పిలిచి కాఫీ తేవాలని చెప్పాడు...

711

ఆ తర్వాత నాతో... ‘‘చూడండి, మీకు చాలా అనుభవం ఉంది. కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ మిమ్మల్ని సెలక్ట్ చేశారు. మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.. 

811

మీరు అనుకున్న ప్రణాళికలు, వ్యూహ్యాలు అన్నీ కోచ్‌లకు, ప్లేయర్లకు ఇవ్వండి. స్ట్రాటెజీ మీటింగ్స్ తీసుకోండి. ప్లేయర్లతో పాటు కోచ్‌ మీతో ఉంటారు...

911

కానీ నేను మీటింగ్‌కి రావాలని పిలవకండి. మరీముఖ్యంగా నేను అడగనిదే, ఏ సలహాలు ఇవ్వకండి. అయితే కోచ్‌లకు, ప్లేయర్లకు మీరిచ్చే సలహాలు, సూచనలన్నీ నాకు మెయిల్‌లో పంపించండి... ’’ అని చెప్పాడు... మాహీ మాటలను విని నేను షాక్ అయ్యా...

1011

ఎంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయితే మాత్రం నేను మీటింగ్స్‌కి రాను, నాకు సలహాలు ఇవ్వకండి అని అనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంత పొగరు... అని మనసులో అనుకున్నా..’ అంటూ కామెంట్ చేశాడు ప్రసన్న అఘోరామ్...

1111

రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌తో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కి స్ట్రాటెజిక్ కోచ్‌గా పనిచేసిన ప్రసన్న, క్రికెట్ సౌతాఫ్రికాకి కోచ్‌గా పనిచేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories