ముంబైయా తొక్కా! వాళ్లకి ఎవ్వరూ భయపడడం లేదు, అందుకే ఇలా... భారత మాజీ కోచ్ రవిశాస్త్రి...

Published : Apr 19, 2022, 02:10 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఛాంపియన్ టీమ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి కొత్త ఫ్రాంఛైజీలు. గత కొన్నేళ్లుగా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రాజస్థాన్ రాయల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్‌లో అదరగొడుతున్నాయి...  

PREV
19
ముంబైయా తొక్కా! వాళ్లకి ఎవ్వరూ భయపడడం లేదు, అందుకే ఇలా... భారత మాజీ కోచ్ రవిశాస్త్రి...

కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, కొత్త కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో 6 మ్యాచుల్లో ఐదు విజయాలు గెలిచి... టేబుల్ టాప్ పొజిషన్‌లో నిలబడితే... ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరింట్లో ఆరు ఓడిపోయింది...

29

కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ మార్కులు తెచ్చుకున్న కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిస్తే, నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచుల్లో ఒకే విజయం అందుకోగలిగింది...

39

‘ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ పొజిషన్స్ చూస్తుంటే నవ్వొస్తోంది. వాళ్లని ఏ జట్టూ లెక్క చేయడం లేదు. ఐపీఎల్ రెండు వారాలు ముగిశాయి...
 

49

9 టైటిల్స్ గెలిచిన ముంబై, చెన్నై కలిసి 12 మ్యాచుల్లో ఒకే విజయం అందుకోగలిగాయంటే... వాళ్లంటే ఏ జట్టూ భయపడడం లేదని క్లియర్‌గా తెలిసిపోతోంది...
 

59

ఇంతకుముందు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌లతో మ్యాచులు ఆడాలంటే పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు ఒత్తిడికి గురయ్యేవి. ఈసారి అలాంటి ప్రెషర్, ఆ టీమ్‌లలో కనిపించడం లేదు...
 

69

దీనికి ఐపీఎల్ మెగా వేలమే కారణం. మెగా వేలం కారణంగా ఆ టీమ్‌లోని ప్లేయర్లు వేరే జట్ల తరుపున ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్‌కి ఆడిన ట్రెంట్ బౌల్డ్, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కి ఆడుతున్నాడు...

79

హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ప్లేయర్లు కూడా టీమ్‌లు మారారు. ఇలాగే ఆడాలి. ఇలాగే పని పూర్తి చేయాలని చెప్పడం చాలా ఈజీ. అయితే ఆ పనిని పూర్తి చేయడం చాలా కష్టం...

89

ఆరు మ్యాచులు ఓడిపోయిన తర్వాత మిగిలిన 8 మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్స్ చేరాలని ఆశపడడం అత్యాశే అవుతుంది. నాలుగు మ్యాచులు ఓడిన తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వడం కూడా అంత తేలికయ్యే పని కాదు...

99

నా అంచనా ప్రకారం ఐపీఎల్ 2022 సీజన్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుంది. ఇకపై ఆ రెండు జట్లే గెలుస్తాయనే భరోసా ఇవ్వలేం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

click me!

Recommended Stories