అందరినీ ఆడించేశారు, ఇకనైనా అర్జున్ టెండూల్కర్‌కి ఛాన్స్ ఇవ్వండి... సచిన్ వారసుడికి...

Published : May 18, 2022, 04:07 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో పరాజయాలను మూటకట్టుకుంది ముంబై ఇండియన్స్. వేలంలో చేసిన తప్పుల కారణంగా రిజర్వు బెంచ్‌లో ఉన్న ప్లేయర్లందరినీ ట్రై చేసింది. అయినా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కి మాత్రం ఇప్పటిదాకా అవకాశం రాలేదు...

PREV
17
అందరినీ ఆడించేశారు, ఇకనైనా అర్జున్ టెండూల్కర్‌కి ఛాన్స్ ఇవ్వండి... సచిన్ వారసుడికి...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ద్వారా డేవాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ, రమన్‌దప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, సంజయ్ యాదవ్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్ వంటి కొత్త కుర్రాళ్లకు అవకాశం దక్కింది..

27

సూర్యకుమార్ యాదవ్ గాయపడడం, సీనియర్లు పెద్దగా పర్ఫామెన్స్ చూపించకపోవడంతో కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి, వారిని ప్రోత్సహించింది ముంబై ఇండియన్స్.

37

అయితే సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇప్పటిదాకా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

47

క్రికెట్ ప్రపంచంలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడితే సచిన్ టెండూల్కర్ ప్రస్తావన తప్పక రావాల్సిందే. టెండూల్కర్ కోసమే క్రికెట్ మ్యాచ్ చూసి, అతను అవుట్ అవ్వగానే టీవీలు బంద్ చేసేవాళ్ల కోట్లల్లో ఉండేది ఆ టైమ్‌లో... 

57

అలాంటి సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్‌ని ఐపీఎల్ 2021 వేలంలో రూ.20 లక్షలకు, ఈసారి రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే ఇప్పటిదాకా అర్జున్ టెండూల్కర్‌ ఒక్క మ్యాచ్ ఆడింది లేదు...

67

‘ముంబై ఇండియన్స్, దాదాపు జట్టులో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చేసింది. ఇప్పటికే సీజన్‌లో ఆఖరి మ్యాచ్‌లో అయినా అర్జున్ టెండూల్కర్‌ని ఆడించండి... అతన్ని ఆడించడానికి ఇదే సరైన సమయం...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

77

అర్జున్ టెండూల్కర్‌ని ఆడించాలని లేదంటే, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ... సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్నారు బుల్లి టెండూల్కర్ ఫ్యాన్స్..

click me!

Recommended Stories