కారణాలు వెతక్కండి, ఆయన ఎప్పుడూ లెజెండే... విరాట్ కోహ్లీ ఫామ్‌పై వుమెన్ క్రికెటర్ కామెంట్...

Published : May 05, 2022, 05:10 PM ISTUpdated : May 05, 2022, 05:34 PM IST

క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ‘గాడ్’ అయితే విరాట్ కోహ్లీ ‘కింగ్’...  70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 71వ సెంచరీ కోసం రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ ఫామ్ చెప్పుకోతగినంత గొప్పగా లేదు...

PREV
16
కారణాలు వెతక్కండి, ఆయన ఎప్పుడూ లెజెండే... విరాట్ కోహ్లీ ఫామ్‌పై వుమెన్ క్రికెటర్ కామెంట్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, రెండు సార్లు రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. రెండు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు...

26

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినా, దాని కోసం 48 బంతులు తీసుకున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతులాడి 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

36

పరుగులు వస్తున్నా, క్రీజులో కుదురుకుపోవడానికి బాగా సమయం తీసుకుంటున్నాడు. దీనివల్ల స్ట్రైయిక్ రేటు 100 దరిదాపుల్లోనే ఉంటోంది. ఇదే ఫ్యాన్స్‌కి మింగుడు పడడం లేదు...
 

46

అయితే పరుగులు వచ్చినా, రాకపోయినా విరాట్ కోహ్లీ ఎప్పుడూ లెజెండే అంటోంది సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ డాన్ వాన్ నికెర్క్... ట్వీట్టర్ ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్‌కి సపోర్ట్ ప్రకటించింది నికెర్క్...

56

‘విరాట్ కోహ్లీని తక్కువ చేయడానికి, విమర్శించడానికి కారణాల కోసం వెతుక్కోకండి. అటు, ఇటు ఎటు చూసినా లెజెండ్... ఎప్పటికీ లెజెండే.. దాన్ని ఎవ్వరూ కాదనలేదు. అంగీకరించలేకపోతే మూసుకోండి.

66

ఓ టోర్నమెంట్, ఓ సీజన్... దశాబ్దాలుగా ఇస్తున్న పర్ఫామెన్స్‌ను తుడిచిపెట్టలేవు...’ అంటూ ట్వీట్ చేసింది సఫారీ వుమెన్ క్రికెటర్ డాన్ వాన్.. 

Read more Photos on
click me!

Recommended Stories