IPL: వేలంలో కోట్లు కొల్లగొట్టినోళ్లు ఎలా ఆడుతున్నారు..? హిట్టా.. ఫట్టా..

Published : May 06, 2022, 01:50 PM IST

Most Expensive Players in IPL 2022: ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా ముగిసిన ఐపీఎల్  మెగా వేలంలో కోట్లు ఖర్చు చేసి వాళ్లను  దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. మరి భారీగా ధర పలికిన ఆటగాళ్లు అంత భారీగా ఆడుతున్నారా..? 

PREV
112
IPL: వేలంలో కోట్లు కొల్లగొట్టినోళ్లు ఎలా ఆడుతున్నారు..? హిట్టా.. ఫట్టా..

ఐపీఎల్ వేలం రెండ్రోజులే జరిగినా చాలా మంది క్రికెటర్ల వందేళ్ల జీవితాలను ప్రభావితం చేయగల సత్తా దానికి ఉంది. తమ పేరు రాగానే తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూసే ఆటగాళ్లు ఎందరో. ఈ ఏడాది కూడా అలా  వేలంలో  భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లు.. దానికి తగ్గట్టుగా ఆడుతున్నారా..? వాళ్లు హిట్టా.. ఫట్టా..? ఓసారి వాళ్ల కథేందో చూద్దాం. ఒక్కో ఫ్రాంచైజీ నుంచి అత్యధిక ధర పొందిన ఆటగాళ్ల  ఆట ఎలా ఉందో తెలుసుకుందాం. 

212

చెన్నై సూపర్ కింగ్స్ : ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి  వేలంలో అత్యధిక ధర (రూ. 14 కోట్లు) పలికిన ఆటగాడు దీపక్ చాహర్.  కానీ గాయం కారణంగా  అతడు ఈ సీజన్  నుంచి వైదొలిగాడు. అయితే చాహర్ తర్వాత అంబటి రాయుడు కోసం చెన్నై రూ. 6.75 కోట్లు వెచ్చించింది.

312

ఈ సీజన్ లో చెన్నై తరఫున 10 మ్యాచులాడిన రాయుడు.. 256 పరుగులు చేశాడు.  మిడిలార్డర్ లో  కీలకంగా మారే రాయుడు పడుతూ లేస్తూ రన్స్ చేస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్న రాయుడు.. ఆశించిన రేంజ్ లో రాణించలేకపోయాడన్నది  గణాంకాలు చెబుతున్న వాస్తవం.

412

లక్నో సూపర్ జెయింట్స్ : వేలంలో అవేశ్ ఖాన్ కు  రూ. 10 కోట్లు చెల్లించింది లక్నో. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అతడు..  ప్రస్తుత సీజన్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు. లక్నో తక్కువ స్కోర్లను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పిటివరకు లక్నో తరఫున 8 మ్యాచులాడి 11 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో  అవేశ్ అదరగొడుతున్నాడు. 

512

రాజస్తాన్ రాయల్స్ :  వేలం ప్రక్రియలో టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను రూ. 10 కోట్లకు దక్కించుకున్నది రాజస్తాన్. ఈ యువ బౌలర్ ఆనతికాలంలోనే రాజస్తాన్ కు ప్రధాన బౌలర్ అయిపోయాడు.  ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ను డగౌట్ లో కూర్చోబెట్టి ప్రసిధ్ ను ఆడిస్తున్నదంటే అతడెంత విలువైన ఆటగాడో అర్థం చేసుకోవచ్చు.  ఈ సీజన్ లో 10 మ్యాచులాడి 12 వికెట్లు పడగొట్టాడు. 

612

గుజరాత్ టైటాన్స్ : లాకీ ఫెర్గూసన్ ను రూ. 10 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నది గుజరాత్. అందుకు తగ్గట్టుగానే వేగంతో పాటు వైవిధ్యాన్ని జత చేసి బంతులు విసురుతున్నాడు లాకీ. ఈ సీజన్ లో 10 మ్యాచులాడి.. 11 వికెట్లు తీశాడు.  ఉమ్రాన్ మాలిక్ తర్వాత అత్యంత వేగవంతమైన డెలివరీ (గంటకు 153.9 కి.మీ) ఫెర్గూసన్ పేరిటే ఉంది. 

712

సన్ రైజర్స్ హైదరాబాద్ : వేలంలో వెస్టిండీస్  నయా సారథి నికోలస్ పూరన్ కు రూ. 10.75 కోట్లు  వెచ్చించింది  ఎస్ఆర్హెచ్. అయితే సన్ రైజర్స్ ఆశలను అతడు వమ్ము చేయలేదు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 మ్యాచులలో.. 9 ఇన్నింగ్స్ లలో 242 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. పూరన్ వచ్చేది  దాదాపు హిట్టింగ్ చేసే సమయంలో.  అతడు తన పాత్రకు  న్యాయం చేకూరుస్తున్నాడు. 

812

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఈసారి వేలంలో వనిందు హసరంగతో పాటు హర్షల్ పటేల్ కు కూడా రూ. 10.75 కోట్లతో దక్కించుకుంది ఆర్సీబీ. ఈ ఇద్దరి మీదే ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చు చేసింది. హర్షల్ పటేల్..  10 మ్యాచులాడి 13 వికెట్లు తీశాడు. హసరంగ.. 11 మ్యాచులలో 16 వికెట్లు  పడగొట్టాడు. వీళ్లిద్దరూ వికెట్లు తీయడమే గాక  ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా హర్షల్ అయితే తన స్లో డెలివరీలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 

912

ఢిల్లీ క్యాపిటల్స్ : ఈ సీజన్ లో శార్దూల్ ఠాకూర్ కు రూ. 10.75 కోట్లు వెచ్చించి  తీసుకున్న ఢిల్లీకి అతడు పెద్దగా న్యాయం చేయలేకపోతున్నాడు.  భారీగా పరుగులిస్తున్న  ఠాకూర్.. ఇప్పటివరకు 9 మ్యాచులలో 7 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటర్ గా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. 9 మ్యాచులలో 89 పరుగులే చేశాడు. ఠాకూర్ ప్రదర్శనపై ఢిల్లీ యాజమాన్యం  అసంతృప్తిగా ఉంది.

1012

పంజాబ్ కింగ్స్ :  వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్  స్టోన్  కు రూ. 11.50 కోట్లు వెచ్చించింది పంజాబ్. అయితే లివింగ్  స్టోన్ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం రాణించలేదు. ఇప్పటివరకు 10 మ్యాచులాడి 293 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 3 వికెట్లు తీశాడు.  

1112

కోల్కతా నైట్ రైడర్స్ :  భారీ అంచనాలతో  ఏకంగా రూ. 12.25 కోట్లతో శ్రేయస్ అయ్యర్ ను దక్కించుకున్న  కేకేఆర్ అతడి మీద భారీ ఆశలు పెట్టుకుంది. అయితే బ్యాటర్ గానే గాక జట్టును నడిపించడంలో కూడా  అయ్యర్ విఫలమయ్యాడు.  బ్యాటర్ గా 10 మ్యాచ్ లలో 36 సగటుతో 324 పరుగులు చేశాడు.  కెప్టెన్ గా కూడా  10 మ్యాచులలో కేకేఆర్ ను 4 మ్యాచులలోనే విజయం  సాధించి పెట్టాడు. 

1212

ముంబై ఇండియన్స్ : ఈసారి వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు ఇషాన్ కిషన్.  అతడి కోసం ముంబై ఏకంగా రూ. 15.25 కోట్లు వెచ్చించింది. దానికి తగ్గట్టుగానే తొలి రెండు మ్యాచులలో అదరగొట్టిన కిషన్.. తర్వాత తేలిపోయాడు. 9 మ్యాచులలో 28.13 సగటుతో 225 పరుగులు మాత్రమే చేశాడు. ఈ వేలంలో భారీ ధర దక్కించుకుని దానికి కనీస న్యాయం చేయని వాళ్లలో(ఇప్పటివరకైతే..) కిషన్ ముందుంటాడు. 

click me!

Recommended Stories