SRH: మన బలమే బలహీనతగా మారిందా..? సన్ రైజర్స్ వరుస వైఫల్యాలకు కారణం ఇదేనా..?

Published : May 06, 2022, 12:49 PM IST

TATA IPL 2022: ఐపీఎల్ లో మరే జట్టుకు లేని బౌలింగ్ వనరులు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఉన్నాయి.  ఈ ఫ్రాంచైజీ ముందు నుంచీ బౌలర్లకు పెద్ద పీట వేస్తున్నది.  ఈ సీజన్ లో కూడా అదే ఫాలో అయింది. కానీ.. 

PREV
110
SRH: మన బలమే బలహీనతగా మారిందా..? సన్ రైజర్స్ వరుస వైఫల్యాలకు  కారణం ఇదేనా..?

ఐపీఎల్-15 సీజన్ లో  వరుసగా రెండు పరాజయాల తర్వాత ఏకంగా ఐదింటిలో విజయం సాధించి ప్లేఆఫ్ రేసులో ముందునిలిచిన సన్ రైజర్స్ ఇప్పుడు మళ్లీ అపజయాల బాట పట్టింది. 

210

గుజరాత్ టైటాన్స్ తో మొదలైన మన ఓటముల పరంపర.. చెన్నై సూపర్ కింగ్స్ మీదుగా  ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వరకు పాకింది. 7  మ్యాచుల (5 విజయాలు, 2 ఓటములు) తర్వాత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్.. పది మ్యాచులు ముగిసేసరికి ఆరో స్థానానికి చేరింది.

310

మూడు మ్యాచులలోనే మనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఎస్ఆర్హెచ్ కు బలమనుకున్న విభాగమే ఈ అపజయాలకు కారణమన్నది  నిర్వివాదాంశం.  భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, మార్కో జాన్సేన్,  ఉమ్రాన్ మాలిక్ వంటి  పటిష్టమైన బౌలింగ్ లైనప్ తో ఉన్న హైదరాబాద్.. గత మూడు మ్యాచులలో లయ తప్పింది. 

410

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో తొలుత మనం బ్యాటింగ్ చేసి 195 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలర్లు భారీగా పరుగులిచ్చి మ్యాచ్ ను పోగొట్టారు. జాన్సేన్.. 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో  అతడి వల్లే హైదరాబాద్ ఓడింది. ఈ  మ్యాచ్ లో నటరాజన్ కూడా 4 ఓవర్లలో 43 పరగులిచ్చుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 

510

చెన్నైతో మ్యాచ్ లో సీఎస్కే  ముందు బ్యాటింగ్ చేసింది. ఈ సీజన్ లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడంటే  మన బౌలర్లు ఎంత దారుణంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.  భువనేశ్వర్ (4 ఓవర్లు 22 పరుగులు) మినహా.. ఉమ్రాన్ మాలిక్ (4 ఓవర్లు 48 రన్స్), నటరాజన్ (4 ఓవర్లు 42 పరుగులు), జాన్సేన్ (4 ఓవర్లు 38 పరుగులు) భారీగా పరుగులిచ్చుకున్నారు. 

610

ఇక ఢిల్లీతోనూ అదే వరస.  తొలి ఓవర్ వేసిన భువీ మేయిడిన్ వికెట్ తీసి మంచి శుభారంభం అందించినా.. అబాట్ (4 ఓవర్లు.. 47), ఉమ్రాన్ మాలిక్ (4 ఓవర్లు 52), శ్రేయస్ గోపాల్ (3 ఓవర్లు 34), కార్తీక్ త్యాగి (3 ఓవర్లు 37) లు ధారాళంగా పరుగిలిచ్చారు. 

710

ఆసక్తికరంగా ఈ మూడు మ్యాచులలో మన బ్యాటర్లు అద్భుతంగా రాణించడం గమనార్హం. సాధారణంగా ఓపెనర్ అవుటయ్యాడంటే ఇక అంతే సంగతులు అన్నట్టుగా ఉండేది హైదరాబాద్ పరిస్థితి. కానీ ఇప్పుడలా కాదు. 

810

ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ రాణిస్తుండగా..  మిడిలార్డర్  లో మార్క్రమ్, పూరన్ లు  ఎదురొడ్డి నిలుస్తున్నారు. గత రెండు మ్యాచులలో ఈ ఇద్దరు హైదరాబాద్  గెలుపు కోసం చేయాల్సిందంతా చేశారు. కానీ బౌలర్ల వైఫల్యం  సన్ రైజర్స్ ను ముంచింది. 

910

గత మూడు మ్యాచులలో భువనేశ్వర్ ఒక్కడే కాస్త మెరుగ్గా రాణిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్  వేగంపైనే ఫోకస్ తప్ప వికెట్లు తీయడం మళ్లీ రెండు మ్యాచులుగా మరిచిపోయాడు.  4 ఓవర్లు వేసి 50 పరుగులకు తక్కువ కాకుండా ఇస్తున్నాడు. వైవిధ్యమమైన బంతులు విసిరే  నటరాజన్ పరిస్థితి కూడా అదే. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రాణించి జాన్సేన్.. ఆ తర్వాత భారీగా పరుగులిస్తున్నాడు. స్పిన్నర్లదీ అదే పరిస్థితి. 

1010

డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్ వంటి అగ్రశ్రేణి దిగ్గజాలు బౌలింగ్ కోచ్ లుగా ఉన్న  సన్ రైజర్స్ లో బౌలర్లు లయ తప్పడానికి కారణాలేంటో గుర్తించి త్వరగా వాటిని పరిష్కరించుకోవాలి.  లేకుంటే ప్లేఆఫ్ రేసులో ఇప్పటికే ఢిల్లీ మనను దాటింది. మిగతా జట్లు కూడా దాటకముందే మేల్కొంటే మంచిదని సన్ రైజర్స్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

click me!

Recommended Stories