తండ్రి వృత్తిని తిడుతూ మహ్మద్ సిరాజ్‌పై దాడి... కుటుంబాన్ని కూడా వదలకుండా బండ బూతులు...

Published : May 28, 2022, 08:45 PM IST

ఆటలో గెలుపు, ఓటములు సహజం. 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ కూడా చాలా మ్యాచుల్లో డకౌట్ కావాల్సి వచ్చింది. అలాగే లెజెండరీ బౌలర్లు కూడా. అయితే అభిమానులు ఫెయిల్యూర్‌ని అంత త్వరగా జీర్ణించుకోలేరు... ఇప్పుడు మహ్మద్ సిరాజ్ కూడా అలా ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.

PREV
18
తండ్రి వృత్తిని తిడుతూ మహ్మద్ సిరాజ్‌పై  దాడి...  కుటుంబాన్ని కూడా వదలకుండా బండ బూతులు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది...

28
mohammed siraj

గత రెండు సీజన్లలో ఆర్‌సీబీ తరుపున అదరగొట్టిన మహ్మద్ సిరాజ్, ఈ సీజన్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 15 మ్యాచుల్లో కలిపి కేవలం 9 వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్, 10.08 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించాడు...

38

ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో 30 సిక్సర్లు సమర్పించిన మొట్టమొదటి బౌలర్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేసిన మహ్మద్ సిరాజ్... తన రిటెన్షన్‌కి న్యాయం చేయలేకపోయాడు. దీంతో ఆర్‌సీబీ ఓటమికి సిరాజ్ కారణమంటూ అతన్ని టార్గెట్ చేయడం మొదలెట్టారు కొందరు అభిమానులు...

48

మహ్మద్ సిరాజ్‌తో పాటు అతని కుటుంబాన్ని బండ బూతులు తిడుతూ హైదరాబాదీ క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో కామెంట్లు చేస్తున్నారు ఆర్‌సీబీ అభిమానులు.. 

58

మరికొందరైతే గత ఏడాది మరణించిన సిరాజ్ తండ్రిని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ఆటో నడిపేవాడి కొడుకుని క్రికెటర్‌ని చేస్తే ఇలాగే ఉంటుందని అడ్డమైన కామెంట్లు చేశారు...

68

మహ్మద్ సిరాజ్ మతాన్ని చేసి కూడా కామెంట్లు వచ్చాయి. ఈ రకమైన అవమానాలను ఎదుర్కోవడం సిరాజ్‌కి కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో ఇలాంటి అవమానాలను లైవ్‌లో చూశాడు సిరాజ్...

78

అయితే అప్పుడు సిరాజ్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేసింది పరాయి దేశం వాళ్లయితే, ఈసారి మాత్రం సొంత దేశంవాళ్లే. సిరాజ్‌పై జరుగుతున్న సైబర్‌ దాడిని ఖండిస్తూ, కొందరు అతనికి అండగా నిలుస్తున్నారు...

88

గత రెండు సీజన్లలో 22 వికెట్లు తీసి 7.41 ఎకానమీతో బౌలింగ్ చేసి, ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచిన సిరాజ్... ఆర్‌సీబీకి చేసిన సేవలను మరిచిపోకూడదంటూ ట్రోలర్స్‌కి గుర్తు చేస్తున్నారు.. 

click me!

Recommended Stories