ఐపీఎల్ 2022 ముగింపు వేడుకల్లో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు... 75వ ఇండిపెండెన్స్ డే థీమ్‌తో..

First Published | May 28, 2022, 7:57 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ ముగింపు వేడుకలను గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమయ్యే ముగింపు వేడుకల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు కూడా ఆరంభం కానున్నాయి...

కరోనా నిబంధనల కారణంగా గత రెండు సీజన్లలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలను కానీ, ముగింపు వేడుకలను కానీ నిర్వహించలేకపోయింది భారత క్రికెట్ బోర్డు...
 

అయితే ఈసారి 10 జట్లతో మెగా సీజన్ ప్రారంభం కావడంతో ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలను ప్రేక్షకుల మధ్య ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది...


Photo source- iplt20.com

మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి లక్షా 25 వేల మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. ఈ మధ్య కాలంలో ఓ క్రికెట్ మ్యాచ్‌కి ఈ రేంజ్‌లో జనం హాజరుకావడం ఇదే తొలిసారి...

బాలీవుడ్‌ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నన్ ఏఆర్ రెహ్మాన్ ప్రోగ్రామ్‌తో ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు ప్రారంభం అవుతాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా, ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకల్లో ఇదే థీమ్‌తో లైవ్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాడు రెహ్మాన్...

అలాగే బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్ తన డ్యాన్సుతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ముగింపు వేడుకల కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ 8 గంటలకు ప్రారంభం కానుంది...

Photo source- iplt20.com

ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రియల్ టైమ్ 18 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈసారి ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డు చెరిగిపోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది బీసీసీఐ... 

Latest Videos

click me!