సంజూ శాంసన్ ఆ విషయం తెలుసుకున్నాడు, అందుకే... రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ సంగక్కర...

Published : May 28, 2022, 07:30 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్... టైటిల్ ఫైట్ కోసం ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. రెండో సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్, మొదటిసారి కెప్టెన్సీ చేస్తున్న హార్ధిక్ పాండ్యా... 15వ సీజన్ టైటిల్ కోసం పోరాడబోతున్నాడు...

PREV
110
సంజూ శాంసన్ ఆ విషయం తెలుసుకున్నాడు, అందుకే... రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ సంగక్కర...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని మ్యాచుల్లో అతను తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు క్రికెట్ విశ్లేషకులు...

210

అయితే ఆ విమర్శలేమీ పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ పోయిన సంజూ శాంసన్, టీమ్‌ని ఫైనల్‌కి చేర్చి కెప్టెన్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు...

310

క్వాలిఫైయర్ 2లో ఆర్‌సీబీని ఓడించి, 2008 సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఫైనల్‌కి అర్హత సాధించి, చరిత్ర క్రియేట్ చేసింది సంజూ శాంసన్ టీమ్. 

410
Sanju Samson

‘సంజూ శాంసన్‌ ఓ అసాధారణ ఆటగాడు. చిన్న వయసులో కెప్టెన్‌గా అతను చాలా పెద్ద భారాన్ని నెత్తికి ఎత్తుకున్నాడు. ముఖ్యంగా గత ఏడాది బయో బబుల్‌ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో శాంసన్ కెప్టెన్సీ అద్భుతం...

510

సంజూ శాంసన్ చాలా మృదు స్వభావి. చాలా తక్కువగా మాట్లాడుతాడు. చాలా రిజర్వ్‌గా ఉంటాడు. బ్యాటుతో సంజూ ఏం చేయగలడో అందరికీ తెలుసు. కెప్టెన్సీ తర్వాత అతనికి క్రికెట్‌లో ఎంత దాహం ఉందో అర్థమైంది...

610

వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీ మూడు చేయడం అంత ఈజీ కాదు. అయితే సంజూ శాంసన్, ఆ పని చేసి చూపిస్తున్నాడు. జోస్ బట్లర్ తర్వాత టీమ్‌లో బెస్ట్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు...

710
Sanju Samson

తనకి ఇచ్చిన రోల్ గురించి సంజూ శాంసన్‌కి పూర్తి అవగాహన ఉంది. సంజూ పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలను రచించగలడు. జట్టులోని ప్రతీ ప్లేయర్‌ని నమ్ముతాడు... అందుకే టీమ్‌, అతన్ని లీడర్‌గా స్వీకరించింది...

810

సంజూ శాంసన్, తాను కూడా ఓ సాధారణ మనిషినే అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అయితే ప్రతీ మ్యాచ్‌లో దిమ్మతిరిగే ఇన్నింగ్స్‌లు ఆడలేమని పసిగట్టాడు... సంజూతో పాటు జోస్ బట్లర్‌కి కూడా ఈ విషయం తెలిసింది...

910
Image credit: PTI

అందుకే ఈ ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. పరిస్థితులను అర్థం చేసుకుని సంజూ శాంసన్, జోస్ బట్లర్ పరుగుల వేగాన్ని పెంచుతున్నారు. బట్లర్ దూకుడుగా ఆడితే శాంసన్ యాంకర్ రోల్ పోషిస్తున్నాడు. బట్లర్ నెమ్మదిగా ఆడుతుంటే శాంసన్ వీరబాదుడు బాదుతున్నాడు... 

1010
Image credit: IPL

టీమ్‌లో ఉన్న 9 మందికి అపారమైన అనుభవం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్లు పెరిగారు. అందుకే కోచ్‌గా నా పని సులువైంది...’ అంటూ చెప్పుకొచ్చాడు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర... 

click me!

Recommended Stories