ప్రతీ క్రికెటర్ కెరీర్‌లో ఒడిదుడుగులు సహజం. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూడా కెరీర్‌లో చాలా సార్లు ఫామ్ కోల్పోయి, పరుగులు చేయలేక ఇబ్బందిపడ్డాడు. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రం అటు క్రికెట్ ఫ్యాన్స్‌ని, భారత అభిమానులను తీవ్రంగా కలవరబెడుతోంది...
రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయినా హాఫ్ సెంచరీలు చేస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. ఫామ్‌లో లేడనే విమర్శలు వచ్చినా, పరుగుల ప్రవాహం, రికార్డు వరద మాత్రం ఆగలేదు...
29
Kohli Golden Duck IPL
అయితే బీసీసీఐతో విభేదాలతో కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత మాత్రం విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి పడుతున్న కష్టం, ప్రతీ క్రికెట్ ఫ్యాన్స్‌ని కలిచి వేస్తోంది. ఒక్కో పరుగు చేయడానికి ఓ మినీ యుద్ధమే చేస్తున్నాడు విరాట్ కోహ్లీ...
39
ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచుల్లో కలిపి 19.6 సగటుతో 216 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ కెరీర్‌లో చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఇప్పటివరకూ 2009 సీజన్‌లో 27.6 సగటుతో 359 పరుగులు చేయడమే విరాట్‌కి అత్యల్ప యావరేజ్‌గా ఉంది. ఈసారి విరాట్ కోహ్లీ 300+ పరుగులు చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది...
49
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అసిఫ్ చేసిన పాత కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
59
‘సచిన్ టెండూల్కర్, బాబర్ ఆజమ్‌లతో పోలిస్తే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. అతను ఎక్కువగా బాటమ్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తాడు... ఫిట్‌నెస్ కారణంగా విరాట్ పరుగులు చేయగలుగుతున్నాడు...
69
అయితే ఒక్కసారి విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి, మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడం అసాధ్యం అవుతుంది. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేస్తాడని అందరూ అంటున్నారు...
79
నాకు తెలిసి విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డులకు దగ్గరగా కూడా రాలేదు. నేను చెబుతున్నా చూడండి... ఎందుకంటే సచిన్ టెండూల్కర్ అప్పర్ హ్యాండ్ ప్లేయర్... అతని టెక్నిక్ చాలా మెరుగ్గా ఉంటుంది...
89
Virat Kohli
విరాట్ కోహ్లీ దగ్గర కూడా చాలా షాట్స్ ఉన్నాయి. అందులో సందేహం లేదు. అయితే అప్పర్ హ్యాండ్‌తో సచిన్ టెండూల్కర్ కొట్టే షాట్స్‌లో టెక్నిక్ ఉంటుంది. అందుకే ఆయన కెరీర్ అంత సుదీర్ఘ కాలం సాగింది...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ అసిఫ్...
99
మహ్మద్ అసిఫ్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉన్నాడు, పరుగులు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు విరాట్ ఫామ్ కోల్పోయి, కమ్‌బ్యాక్ ఇవ్వడానికి కష్టపడుతుండడంతో అసిఫ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి...