అఫ్రిదీయా తొక్కా! పాక్ బౌలర్‌ని ఓ ఆటాడుకున్న పూజారా... కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో సెంచరీతో...

Published : May 08, 2022, 03:30 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ యంగ్ పేసర్ షాహీన్ అఫ్రిదిని ఎదుర్కోవడానికి భారత స్టార్ బ్యాట్స్‌మెన్ తెగ ఇబ్బందిపడ్డారు. అయితే భారత టెస్టు బ్యాట్స్‌మెన్ పూజారా మాత్రం అఫ్రిది బౌలింగ్‌ను ఈజీగా ఫేస్ చేయడమే కాదు, బౌండరీలు బాది పాక్ కుర్ర బౌలర్‌ను ఎలా ఆడాలో భారత టాప్ బ్యాటర్లను పాఠాలు నేర్పించాడు...

PREV
19
అఫ్రిదీయా తొక్కా! పాక్ బౌలర్‌ని ఓ ఆటాడుకున్న పూజారా... కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో సెంచరీతో...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన షాహీన్ అఫ్రిది, ఆ తర్వాత కెఎల్ రాహుల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు...

29
Shaheen Afridi-Virat Kohli

హాఫ్ సెంచరీతో కుదురుకుపోయిన అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీ కూడా షాహీన్  ఆఫ్రిదీ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత టాప్ 3 బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసిన అఫ్రిది... వాళ్లు ఎలా అవుట్ అయ్యిందీ వ్యంగ్యంగా ఇమిటేట్ చేసి చూపిస్తూ... టీమిండియా ఫ్యాన్స్‌ని బాగా హర్ట్ చేశాడు..

39
Cheteshwar-Pujara

అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ తరుపున ఆడుతున్న భారత టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా మాత్రం షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లో అప్పర్ కట్ సిక్సర్ బాది, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపోయేలా చేశాడు...

49

కౌంటీ సీజన్‌లో వరుసగా నాలుగో సెంచరీ నమోదు చేశాడు ఛతేశ్వర్ పూజారా... ఇప్పటికే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ క్లబ్ తరుపు రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేసిన పూజారాకి ఇది నాలుగో సెంచరీ. 

59

మిడిల్‌సెక్స్ క్లబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా... రెండో ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసి మూడో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా క్రీజులో నిలిచాడు...

69

టీమిండియా తరుపున గత మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, ఈ మధ్య ఆడిన చాలా ఇన్నింగ్స్‌లో 40 కంటే తక్కువ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా పూజారా స్ట్రైయిక్ రేటుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే...

79

అయితే ఈ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 60-70 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన పూజారా, మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ఏకంగా 83.89 స్ట్రైయిక్ రేటుతో సెంచరీ బాదడం విశేషం...

89
Cheteshwar Pujara

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే 531 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 

99
Cheteshwar Pujara

పాక్ క్రికెటర్ షాన్ మసూద్ 6 ఇన్నింగ్స్‌ల్లో 118 సగటుతో 713 పరుగులు చేయగా బెన్ కాంప్టన్ 7 ఇన్నింగ్స్‌ల్లో 93 సగటుతో 560 పరుగులు చేశాడు. పూజారా 5 ఇన్నింగ్స్‌ల్లో 132.75 సగటుతో 531 పరుగులు చేయడం విశేషం. 

click me!

Recommended Stories