మళ్లీ సున్నా చుట్టిన విరాట్ కోహ్లీ... సన్‌రైజర్స్‌పై ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ గోల్డెన్ డక్‌...

Published : May 08, 2022, 04:21 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్. వరల్డ్ క్లాస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించి, టన్నుల్లో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్. అయితే అదంతా గతం. ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి వేరు...  

PREV
16
మళ్లీ సున్నా చుట్టిన విరాట్ కోహ్లీ... సన్‌రైజర్స్‌పై ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ గోల్డెన్ డక్‌...

టీమిండియా కెప్టెన్సీ పోయి, ఐపీఎల్‌లో కెప్టెన్సీ వదులుకున్న విరాట్ కోహ్లీ, ఈ సారి వీర లెవెల్లో రెచ్చిపోతాడని... ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తాడని భావించారు ఆయన అభిమానులు...
 

26

అయితే ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరు మాత్రం ఫ్యాన్స్ అంచనాలకు రివర్స్‌లో సాగుతోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ, ఇన్నింగ్స్ మొదటి బంతికే జగదీశ సుచిత్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

36

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరాట్ కోహ్లీకి ఇది రెండో గోల్డెన్ డక్. ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ మధ్య సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్. ఆ మ్యాచ్‌లో 68 పరుగులకే కుప్పకూలి, చిత్తుగా ఓడింది ఆర్‌సీబీ...
 

46
Kohli Golden Duck IPL

ఈ సీజన్‌లో 12 మ్యాచుల్లో కలిపి 19.6 సగటుతో 216 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ కెరీర్‌లో చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఇప్పటివరకూ 2009 సీజన్‌లో 27.6 సగటుతో 359 పరుగులు చేయడమే విరాట్‌కి అత్యల్ప యావరేజ్‌గా ఉంది. ఈసారి దాన్ని బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు కోహ్లీ...

56

ఒకే సీజన్‌లో మూడు సార్లు గోల్డెన్‌ డకౌట్ అయిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు 2013 సీజన్‌లో సురేష్ రైనా, 2018లో రోహిత్ శర్మ, 2020 సీజన్‌లో నితీశ్ రాణా... మూడు సార్లు మొదటి బంతికే పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరారు...

66

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరాట్ కోహ్లీకి ఇది మూడో డకౌట్. ఇంతకుముందు దినేశ్ కార్తీక్ ఐదు సార్లు, అజింకా రహానే మూడు సార్లు... ఆరెంజ్ ఆర్మీపై పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు...

Read more Photos on
click me!

Recommended Stories