మెస్సీ, రొనాల్డో ఒకే టీమ్‌కి ఆడుతున్నారా?... ఆ ఇద్దరి గురించి జోస్ బట్లర్ వైరల్ ట్వీట్‌కి ఆరేళ్లు...

First Published May 14, 2022, 6:11 PM IST

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి గ్రీన్ కలర్ జెర్సీ పెద్దగా కలిసి రాలేదు. అయితే గ్రీన్ కలర్ జెర్సీలో మ్యాచులు గెలిచిన ప్రతీ సీజన్‌లోనూ (ఈ సీజన్‌లో ఇంకా డిసైడ్ కాలేదు) ఫైనల్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే 2016 సీజన్‌లో ఆర్‌సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో ఆడిన మ్యాచ్ చాలా ప్రత్యేకం...

టాస్ గెలిచి ఆర్‌సీబీకి బ్యాటింగ్ అప్పగించింది గుజరాత్ లయన్స్. అప్పటికే టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ముందు ఆర్‌సీబీ నిలవడం కష్టమేనని అనుకున్నారంతా. అనుకున్నట్టే క్రిస్ గేల్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు...

వన్‌డౌన్‌లో వచ్చిన ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక భాగస్వామ్యం. విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 109 పరుగులు చేసి అవుట్ కాగా ఏబీ డివిల్లియర్స్ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరగుులు చేసి అజేయంగా నిలిచాడు... 

ఈ ఇద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. గుజరాత్ లయన్స్ 18.4 ఓవర్లలో 104 పరుగులకి ఆలౌట్ అయ్యి 144 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది...

ఈ మ్యాచ్ సమయంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వేసిన ట్వీట్, తెగ వైరల్ అయ్యింది. ‘రొనాల్డో, మెస్సీ కలిసి ఒకే టీమ్‌కి ఆడుతున్నారా... అన్నట్టుంది...’ అంటూ విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ గురించి ట్వీట్ చేశాడు బట్లర్...

ఐపీఎల్ 2016 సీజన్‌లో గ్రీన్ జెర్సీలో మ్యాచ్ గెలిచిన తర్వాత వరుసగా ఐదు సీజన్లలోనూ ‘గో గ్రీన్’ జెర్సీ ఆర్‌సీబీకి విజయాలను తెచ్చిపెట్టలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో మాత్రం ఆర్‌సీబీ గ్రీన్ జెర్సీలో మ్యాచ్ గెలవడంతో ఈసారి కూడా ఆ టీమ్‌ ఫైనల్ చేరుతుందని ఆశపడుతున్నారు ఫ్యాన్స్...

సరిగ్గా ఆరేళ్ల తర్వాత జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ 2016 సీజన్‌లో నెలకొల్పిన 973 పరుగుల రికార్డును నెలకొల్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే 3 సెంచరీలతో 625 పరుగులు చేసిన బట్లర్, విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేయాలంటే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరాల్సి ఉంటుంది...

గ్రూప్ స్టేజీలో మరో 2 మ్యాచులు మిగిలి ఉండగా ప్రస్తుతం 12 మ్యాచుల్లో 7 విజయాలతో టాప్ 3లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తే మరో 2 లేదా 3 మ్యాచులు ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు జోస్ బట్లర్ 5 మ్యాచుల్లో 350+ పరుగులు చేస్తే విరాట్ రికార్డుకు చేరువవుతాడు...

click me!