ఈ సీజన్ లో సీఎస్కే తరఫున 10 మ్యాచులాడిన జడ్డూ.. బ్యాటింగ్ లో 116 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 33 ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కెప్టెన్ గా 8 మ్యాచులకు సారథ్యం వహించి రెండింట్లో గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడాడు. రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ జడ్డూ.. ఆ తర్వాత చెన్నై ఆడిన మూడు మ్యాచుల్లో కనిపించలేదు.